Health Tips: కొలస్ట్రాల్ పెరగొద్దంటే ఈ పాత అలవాట్లని ఈ రోజే మానేయ్యండి..!
Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగితే వ్యాధుల తీవ్రత ఎక్కువవుతుంది.
Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగితే వ్యాధుల తీవ్రత ఎక్కువవుతుంది. మొదటగా హై బీపీ మొదలవుతుంది. తరువాత గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. లేదంటే పెరిగిన కొలెస్ట్రాల్ వల్ల ఊబకాయం వచ్చి అన్ని సమస్యలకు కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని అలవాట్లను అనుసరించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ 2 నుంచి 3 మొగ్గలు నమిలితే బెటర్.
2. మీరు పాలు, పంచదారతో టీ తాగితే వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
3. కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కొలస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.
4. అవిసె గింజలు తినడం అలవాటు చేసుకోండి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఎందుకంటే ఈ గింజల్లో లినోలెనిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి.
5. మీ దైనందిన జీవితంలో పచ్చి కూరగాయలను తినడం అలవాటు చేసుకోండి. వంట నూనెను తక్కువగా వాడండి.
అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని చెడు అలవాట్లను వదిలివేయడం మంచిది.
1. ఈరోజే ధూమపాన వ్యసనాన్ని విడిచిపెట్టండి
2. రోజూ 8 గంటల కంటే తక్కువ నిద్రపోకండి
3. సంతృప్త కొవ్వులున్న ఆహారాలు తినవద్దు
4. జిడ్డుగల ఆహారాలు మానుకోండి
5. చక్కెర, ఉప్పు తీసుకోవడం పరిమితం చేయండి.
6. ఎక్కువ వ్యాయామాలు చేయండి
7. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం తక్కువ తినండి.