Cholesterol: అధిక కొలెస్ట్రాల్‎తో జాగ్రత్త..కంట్రోల్ చేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు

Cholesterol: దేశంలో అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా మారుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండెజబ్బులకు కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.

Update: 2024-07-05 05:00 GMT

Cholesterol : అధిక కొలెస్ట్రాల్‎తో జాగ్రత్త..కంట్రోల్ చేయకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు

Cholesterol :దేశంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు కారణం అవుతుందని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు.అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ కు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు భారత్ లో నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేవు. 2019లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇచ్చిన మార్గదర్శకాలనే భారత్ లోనూ వైద్యులు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భారత్ లో మొదటిసారిగా 22 మంది సభ్యులతో కూడిన కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొలెస్ట్రాల్ లెవల్స్ నిర్వహణఖు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

అధిక కొలెస్ట్రాల్ తో ప్రాణాలకు ముప్పు:

రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ లెవల్స్ ఎక్కువగా ఉంటడం, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ తోపాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. డై స్లిపెడెమియా ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె జబ్బులకు కారణమయ్యే సైలెంట్ కిల్లర్ అని వైద్యులు చెబుతున్నారు. చక్కెర, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. సమతుల్య ఆహారం, వ్యాయామం, ఔషధాల ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ మిన దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల ప్రజల్లో హెచ్ డీఎల్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలింది.

కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే సమస్యలు:

కొలెస్ట్రాల్‌ సమస్య వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యే కాదని, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దీని బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారంలో ఆటంకాలు కొలెస్ట్రాల్‌ను పెంచే కారకాలు కావచ్చు. గర్భనిరోధక మాత్రలు, మూత్రవిసర్జన మందులు, బీటా-బ్లాకర్స్, డిప్రెషన్ చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న కుటుంబంలో ఎక్కువ ప్రమాదం ఉండవచ్చు. 

Tags:    

Similar News