Health Tips: మధుమేహ రోగులకి అలర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోపోతే దంతాలకి ఎఫెక్ట్..!
Health Tips: నేటి కాలంలో మధుమేహం ఒక సాధారణ వ్యాధిగా మారింది.
Health Tips: నేటి కాలంలో మధుమేహం ఒక సాధారణ వ్యాధిగా మారింది. ఇండియాలో చాలా మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా జీవించగలరు. ముఖ్యంగా డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయి తరచుగా పెరుగుతుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల దంతాలు దెబ్బతింటాయి. ఇది గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధితో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. దీనిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
నోటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అవి రక్తంలోని చక్కెరతో కలిసినప్పుడు దంతాల చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తాయి. ఇందులో ఒక ప్రత్యేక రకం యాసిడ్ ఉంటుంది. ఇది క్రమంగా దంతాలను కుళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి దంత సమస్యలు ఏర్పడుతాయి. అలాగే మధుమేహం రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. దీనివల్ల ఈ పేషెంట్లు అనేక ఇతర వ్యాధులకి గురవుతారు. ఇందులో చిగుళ్ళ వ్యాధి కూడా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి.
2. ప్రతి రోజూ ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలి.
3. రెండు దంతాల మధ్య అంటుకున్న మురికిని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ ఉపయోగించడం మేలు.
4. సిగరెట్, ఆల్కహాల్, శీతల పానీయాలు దంతాలకు హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉంటే మంచిది.
5. సాధారణ దంతవైద్యుల వద్దకు వెళ్లి తరచూ దంత పరీక్ష చేసుకోవాలి. అవసరమైతే స్కేలింగ్ చేయించుకోవడం ఉత్తమం.