బేకింగ్ సోడాను చాలమంది వంటగదిలో ఉపయోగిస్తుంటారు. బేకింగ్ సోడా వంటకే కాదు చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బేకింగ్ సోడాని "సోడియం కార్బోనేట్ " అని పిలుస్తారు, దీని రసాయన లక్షణాలు చర్మాన్ని వ్యాధులభారీనుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది.
* బేకింగ్ సోడాని,నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
* చర్మం లోని అందం దూరమైతే, కాంతివంతం కోసం చిట్కా కావాలంటే, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే, బేకింగ్ సోడా, మలినాలతో పూడిపొయిన మీ చర్మ రంద్రాలని శుబ్రం చేసి సహజత్వం లేని మీ చర్మాన్ని ఎంతో కాతివంతంగా, మరియు మృదువుగా చేస్తుంది.
* అరికాళ్లు పగుళ్ళతో బాధపడుతుంటే, కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక 30 నిమిషాలు మీ కాళ్లని నీటిలో ఉంచి, తరువాత శుబ్రం చేసుకోవాలి, ఈ పద్దతి వల్ల కొత్త చర్మ కణాలు పుడతాయి అందువల్ల మీకు అరికాళ్ళ పగుళ్ళనుండి విముక్తి లబిస్తుంది.
* బేకింగ్ సోడాని స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి, కొత్త కణాలు వస్తాయి, అవి మీ శరీరంలో దుర్వాసనను నశింపజేసి ,శరీరాన్ని తాజాగా ఉంచ్చుతుంది.
* సూర్యుని కాంతి వల్ల, కందిపొయిన, దురద వస్తున్న, చిరాకు కలిగిస్తున్న శరీర సం రక్షణ కోసం, ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడాని కొంచెం నీటితో కలిపి చర్మానికి రాస్తే శరీరం చల్లబడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.