Heart Patients: హార్ట్‌ పేషెంట్స్‌ అలర్ట్‌.. ఈ విషయంలో టైమింగ్‌ మార్చుకోవాల్సిందే..!

Heart Patients: త్వరలో డిసెంబర్‌ నెల ప్రారంభంకాబోతుంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

Update: 2023-11-27 08:00 GMT

Heart Patients: హార్ట్‌ పేషెంట్స్‌ అలర్ట్‌.. ఈ విషయంలో టైమింగ్‌ మార్చుకోవాల్సిందే..!

Heart Patients: త్వరలో డిసెంబర్‌ నెల ప్రారంభంకాబోతుంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హార్ట్‌ పేషెంట్స్‌ అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో హార్ట్‌ఎటాక్‌ కేసులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి హృద్రోగులు గుండెపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మార్నింగ్ వాక్ వెళ్లే టైమింగ్ మార్చుకోవాలి. తద్వారా ఎలాంటి సమస్యా ఉండదు.

చలికాలంలో మార్నింగ్ వాక్ ఎప్పుడు చేయాలి?

హృద్రోగులు మార్నింగ్ వాక్ కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలంటే సూర్యుడు ఉదయించిన తర్వాతే బయటికి వెళ్లాలి. కరోనా తర్వాత గుండెపోటు ముప్పు వేగంగా పెరిగింది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ 19కి ముందు 40 ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 20-30 ఏళ్ల యువత కూడా దీని బారిన పడుతున్నారు.

డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్లాలి

గుండె ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండమని చెబుతున్నారు. వాకింగ్ లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, బరువుగా ఉండటం వంటి సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి

జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం వేగంగా పెరుగుతోంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతోంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో దీనికి పూర్తిగా దూరంగా ఉండాలి.

Tags:    

Similar News