Heart Attacks: చలికాలంలో గుండెపోటు కేసులు ఎక్కువ..! ఎందుకో తెలుసా..?

*అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులలో గుండెపోటు ప్రమాదం 30 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది.

Update: 2021-11-19 04:30 GMT

 చలికాలంలో గుండెపోటు కేసులు ఎక్కువ(ఫైల్ ఫోటో)

Heart Attacks: గుండెపోటు కేసులు ఎక్కువగా చలికాలంలోనే వస్తాయి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా! ప్రతి సంవత్సరం శీతాకాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చలికాలంలో గుండెపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.

అందుకే ఈ సీజన్‌లో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక పరిశోధన ప్రకారం ఊబకాయం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులలో గుండెపోటు ప్రమాదం 30 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది.

చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీంతో శరీరం చల్లబడుతుంది. అప్పుడు గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ ముడుచుకున్న రక్తనాళాల నుంచి రక్తం సరఫరా కావాలంటే మరింత ఒత్తిడి అవసరం.

రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వస్తుంది. మరోవైపు చలికాలంలో రక్తం చిక్కబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రక్తం గడ్డకట్టడం సులభం అవుతుంది. ఈ గడ్డలు రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా రోగులు స్ట్రోక్‌కి గురవుతారు.

ఒక పరిశోధన ప్రకారం వింటర్ సీజన్‌లో సోమవారాల్లో చాలా గుండెపోటు కేసులు వస్తున్నాయని తేలింది. దీనికి క‌చ్చితమైన కార‌ణం ఏంట‌నేది ఇప్పటి వ‌ర‌కు సైంటిస్టులు క‌నిపెట్టలేక‌పోయారు. హార్ట్ ఎటాక్ కేసులు క్రిస్మస్ నుంచి ప్రారంభమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

అందువల్ల శీతాకాలంలో గుండె రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఛాతీలో మండుతున్నట్లయితే, ఒక రకమైన ఒత్తిడి, నొప్పి ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఇది కాకుండా కాళ్ళలో వాపు, దవడలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాంటి సమయాల్లో ఎక్కువ నీరు తాగకూడదు.

Tags:    

Similar News