Healthy Juices To Keep Yourself Hydrated: వేసవి ఈ డ్రింక్స్ తో ఎంతో రిలీఫ్..

* వేసవి కాలం వచ్చిందంటే డీహైడ్రేషడ్రేన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలసట, విపరీతమైన చెమట, గుండెల్లో మంట, అతిసారం , యూటీఐ, ఎసిడిటి వంటి జీర్ణక్రియక్రి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి బయపడాలంటే కడుపుని, శరీరాన్ని చల్లబరిచే పానీయాలు తాగాలి అవేంటంటే...

Update: 2023-05-15 15:00 GMT

Healthy Juices: వేసవి ఈ డ్రింక్స్ తో ఎంతో రిలీఫ్..

Healthy Juices: ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులు తుఫాను ప్రభాప్రభావంతో వానలు పడగానే.. సూర్యుడు శాంతిస్తాడని అంతా అనుకున్నారు . కానీ భానుడు మాత్రం భగభగలాడిపోతున్నాడు. బయటకు అడుగు పెడితే తలలోంచి చెమటలు కారుతున్నాయి. మార్కె టింగ్ వంటి జాబ్స్ చేసేవాళ్లు ఎండవేడి తట్టు కోలేకపోతున్నారు . వీరికి డిహైడ్రేషడ్రేన్ కి తోడు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మరి, ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలి.. మార్గం ఏదైనా ఉందాఅంటే ఉంది..మన జీర్ణక్రియక్రికు మేలు చేయడంతో పాటు డిహైడ్రేషడ్రేన్ సమస్యకు చెక్ పెట్టే పానీయాలు చాలా ఉన్నాయి. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మజ్జిగ :

వేసవితాపం నుంచి బయటపడేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిశ్రస్తా రు . కానీ కూల్ డ్రింక్స్ కన్నా మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక వ్య వస్థని పెంచుతాయి. అంతేకాదు , ఊపిరితిత్తులు , గుండె, మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో రిబో ఫ్లోవిన్ని అందించే విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి తక్షణశక్తిని ఇవ్వ డమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచి కడుపులో అజీర్తి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

నిమ్మరసం :

వేసవిలో నిమ్మరసం బెస్ట్ రిఫ్రెష్ డ్రింక్ అని చెప్పొ చ్చు. ప్రోటీన్, కొవ్వు , విటమిన్ సి, కాల్షియం , ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉండే నిమ్మమన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతగ్రలు కారణంగా ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. రోజూ ఉదయా న్నేనిమ్మ రసం నీళ్లు తాగడం వల్ల ఒంట్లో నీటిశాతం పడిపోకుండాచూసుకోవచ్చు . నిమ్మరసం మూత్రంలో సిట్రేట్ట్రే స్థాయిలను పెంచి..కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ రోజూ నిమ్మ రసంతాగితే... రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. వేసవిలో చాలా మందికి నోరు పొడిబా రిపోవడం , తరచుగా దాహం వేయడం , అలాగే మూత్ర విసర్జన సమస్యలు ఉంటాయి. ఇలాంటివాళ్లు నిమ్మకాయ నీరుతాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొబ్బ రినీరు :

వేసవిలో కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యా నికి చాలా మంచిది. శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన లక్షణం కొబ్బరి నీటిలో ఉంది. వేసవిలో దాహం అధికంగా ఉండడంతో చాలా మంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపు తారు కానీ అది అంత శ్రేయశ్రే స్కరం కాదు . సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీరు సేవించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొబ్బరినీటిలో సహజ విటమిన్లు , ఖనిజాలు ఉం టాయి. ఇవి హైడ్రేషడ్రేన్ కు సహాయపడతాయి. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొబ్బ రినీరు తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు . కొబ్బరినీరులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మనల్ని రిఫ్రెష్ గా , హైడ్రైట్ డ్రైగా ఉంచుతాయి.

చెరకు రసం :

వేసవి కాలంలో మన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోవడం జరుగుతుంది. శరీరం డీహైడ్రేషడ్రేన్ కు గురి కావడం , గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం వంటి సమసల్యు ఉంటాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే చెరుకు రసానికి మించింది మరొకటిలేదు . ఎండ తీవ్రతవ్ర వల్ల అలసటకు గురై శక్తి కోల్పో యినవారు చెరుకు రసం తాగితే వెంటనే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు . తిరిగి పని చేయగలుగుతారు . వేసవితాపం తగ్గుతుంది. శరీరం చురుగ్గామారుతుంది.

పటిక బెల్లం :

పటిక బెల్లాన్ని మిశ్రిలేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు . మన తెలు గిళ్లల్లో ఇది ఉండే అవకాశం ఎక్కువే. ఎందుకంటే దేవునికి ప్రసాప్రసాదంగా ఎక్కువగా దీన్నే నివేదిస్తూ ఉంటారు . పటిక బెల్లంలో ఇన్ ఫ్లమేషన్ తో పోరాడే ఖనిజాలు , సమ్మేళలాను పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం పై శీతలీకరణ ప్రభాప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం నుంచి వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పటిక బెల్లాన్ని నీటిలో లేదా పాలల్లో కలిపితా గితే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

అరటి దిండు రసం :

వేసవి కాలం వచ్చిం దం టే డీహైడ్రేషడ్రేన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలసట, విపరీతమైన చెమట, గుండెల్లో మంట, అతిసారం , యూటీఐ, ఎసిడిటి వంటి జీర్ణక్రియక్రి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి బయపడాలంటే కడుపుని, శరీరాన్ని చల్లబరిచే పానీయాలు తాగాలి. వేసవిలో అరటి దిండు రసం తాగడం చాలా మంచిది. అరటి చెట్టులో పల ఉండే తెల్లని పదార్థాన్ని అరటి దిండు అంటారు . అరటి దిండులో పొటాషియం , విటమిన్ బి6, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ సైతం అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం , మలబద్ధకం వంటి సమస్యలకు అరటిదిండు రసం చెక్ పెడుతుంది.

Tags:    

Similar News