Potatoes Side Effects: బంగాళదుంపలు ఎక్కువగా తింటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..!
Potatoes Side Effects: బంగాళదుంప మనం రోజు వాడే కూరగాయలలో ఒకటి.
Potatoes Side Effects: బంగాళదుంప మనం రోజు వాడే కూరగాయలలో ఒకటి. దీంతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. సమోసా, చిప్స్ వంటి చిరుతిండిలో కూడా ఉపయోగిస్తారు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు. బంగాళదుంపని ఆంగ్లంలో పొటాటో, హిందీలో ఆలూ, తెలుగులో ఊర్లగడ్డ అని పిలుస్తారు. బంగాళదుంపలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ దీనని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
1. బంగాళాదుంపలను పెద్ద ఎక్కువగా తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు దీనివల్ల అలెర్జీ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
2. బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుంది. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు ఎక్కువగా బంగాళాదుంపలను తినకూడదు. వాటికి దూరంగా ఉంటే మంచిది.
3. బంగాళాదుంపల అధిక వినియోగం మీ రోగాలని మరింత పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు వీటికి దూరంగా ఉండాలి. బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి.
4. బంగాళాదుంపల అధిక వినియోగం రక్తపోటును పెంచుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అంటే బీపీ రోగులు బంగాళదుంపలు ఎక్కువగా తినకూడదు.
5. బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఇందులో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.