Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ మంచిదా.. కార్న్‌ మంచిదా..?

Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా రకరకాల ఐటమ్స్‌ ఉంటాయి. అందులో ఎవరికి నచ్చినవి వారు తింటారు...

Update: 2022-01-03 09:30 GMT

Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ మంచిదా.. కార్న్‌ మంచిదా..?

Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా రకరకాల ఐటమ్స్‌ ఉంటాయి. అందులో ఎవరికి నచ్చినవి వారు తింటారు. మరికొంతమంది బిజీ షెడ్యూల్‌ కారణంగా లేదా సమయం లేకపోవడం వల్ల టిఫిన్ కూడా మిస్‌ చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. దీనివల్ల విపరీతమైన బరువు పెరుగుతారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా హెవీ కేలరీలు ఉన్న ఆహరాలు తింటే ఏం ప్రయోజనం ఉండదు. లైట్‌ఫుడ్‌ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో రెండు ఆహారాలు పోటీ పడుతాయి. ఒకటి కార్న్‌, రెండోది ఓట్స్‌. ఈ రెండిటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.

కార్న్ ఫ్లేక్స్: దీనిని మొక్కజొన్న నుంచి తయారుచేస్తారు. 100 గ్రా కార్న్ ఫ్లేక్స్‌లో 0.4 గ్రా కొవ్వు, 84 గ్రా పిండి పదార్థాలు, 7.5 గ్రా ప్రోటీన్, 1.2 గ్రా ఫైబర్, 2% కాల్షియం మొత్తం 378 కేలరీలు ఉంటాయి.

వోట్స్: 100 గ్రా ఓట్స్‌లో 10.8 గ్రా కొవ్వు, 26.4 గ్రా ప్రోటీన్, 16.5 గ్రా ఫైబర్, 103 గ్రా పిండి పదార్థాలు, 8% కాల్షియం మొత్తం 607 కేలరీలు ఉంటాయి.

రెండిటి వల్ల ప్రయోజనాలు

కార్న్‌ఫ్లేక్స్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు చాలా ఆరోగ్యకరమైనది. మీరు పాలలో కార్న్ ఫ్లేక్స్ వేసుకొని తింటే శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బరువు తగ్గే వారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గడంలో ప్రయోజనం ఉంటుంది. ఇక మీరు అల్పాహారంలో ఓట్స్ తింటే మీకు ఎక్కువసేపు ఆకలి అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది. ఓట్స్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. దీనిలో తక్కువ కొలెస్ట్రాల్ కారణంగా ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. గుండెకు సహాయపడుతుంది.

Tags:    

Similar News