Health: కోపం వచ్చినప్పుడు ఇలా కంట్రోల్‌ చేసుకోండి..!

Health: కోపం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది చాలా అనర్థాలకి కారణం అవుతుంది.

Update: 2022-04-16 15:15 GMT

Health: కోపం వచ్చినప్పుడు ఇలా కంట్రోల్‌ చేసుకోండి..!

Health: కోపం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది చాలా అనర్థాలకి కారణం అవుతుంది. కోపం కారణంగా ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. వీటివల్ల విపరీతమైన టెన్షన్ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో BP కూడా పెరుగుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్‌కి దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. దీంతో సమస్యలు సద్దుమణిగిపోతాయి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అటువంటి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. యోగా చేయడం అలవాటు చేసుకోండి

యోగా చేయడం వల్ల కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేస్తే శరీరంలో చాలా మార్పులు వస్తాయి.

2. ప్రతిరోజూ వ్యాయామం చేయండి

ఇది కాకుండా వ్యాయామం చేస్తే కోపం తగ్గుతుంది. మీరు చిన్న నడక ద్వారా దీన్ని ప్రారంభించవచ్చు. ఇది మీ ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు.

3. ధ్యానం చేస్తే కోపం తగ్గుతుంది

అనేక సమస్యలకు ధ్యానం మందు అంటారు. మీరు ధ్యానం చేస్తే చాలా పెద్ద వ్యాధులు మీ నుంచి దూరమవుతాయి. మనసు తేలికగా అవుతుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే శక్తి లభిస్తుంది.

4. గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచిది

ఇది కాకుండా మీకు కోపం వచ్చినప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బీపీ పెరగదు. కోపం కంట్రోల్ అవుతుంది.

5. సంగీతం వింటే మానసిక స్థితి బాగుంటుంది

మంచి సంగీతం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే మంచి మ్యూజిక్ వింటే టెన్షన్ తగ్గుతుంది. భక్తి పాటలను వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోపం నుంచి మిమ్మల్ని మీర డైవర్ట్ చేసుకోండి. ఇలాచేస్తే చాలా వరకు కోపం తగ్గుతుంది.

Tags:    

Similar News