Health Tips: శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే..లేదంటే?
Health Tips: మన శరీరంలో మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. వాటిలో చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హానికలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే ధనమనులు అడ్డుకోవడం ప్రారంభం అవుతుంది. ఇది కరోనరీ హార్ట్ డిసిజ్, స్ట్రోక్, గుండెపోటు వంటి అనేక రకాల గుండె సంబంధిత వ్యాధులను పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Health Tips: మన శరీరంలో మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. వాటిలో చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హానికలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగితే ధనమనులు అడ్డుకోవడం ప్రారంభం అవుతుంది. ఇది కరోనరీ హార్ట్ డిసిజ్, స్ట్రోక్, గుండెపోటు వంటి అనేక రకాల గుండె సంబంధిత వ్యాధులను పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల లక్షణాలు కొలెస్ట్రాల్ పెరుగుదలను సూచిస్తాయి. అలాంటి లక్షణాలేవో చూద్దాం.
హెల్త్ లైన్ రిపోర్టు ప్రకారం..శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి ఒక లక్షణం. కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకుంటుంది. దీంతో గుండెకు తగినంత రక్తాన్ని పంప్ చేయడం కష్టంగా మారుతుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
రాత్రి పూట మరింత అలసటగా, బలహీనతగా అనిపిస్తే ఇది కూడా కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పెరిగిన కొలెస్ట్రాల్ రక్తాన్ని పంప్ చేయడానికి గుండెను కష్టతరం చేస్తుంది. దీనికాణంగా శరీరానికి కావాల్సినంత శక్తి లభించద. దీంతో మీరు తీవ్ర అలసటకు గురవుతారు.
రాత్రిపూట ఛాతీ నొప్పి కూడా అధిక కొలెస్ట్రాల్ కు ఒక సంకేతం. నిజానికి చెడు కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకున్నప్పుడు రక్తప్రసరణ నిరోధిస్తుంది. ఫలితగా ఆక్సిజన్ ఉన్న రక్తం గుండెకు చేరుకోదు. దీంతో ఛాతినొప్పి వస్తుంది.
చేతులు, కాళ్లలో జలదరింపులు కూడా చెడు కొలెస్ట్రాల్ కు సంకేతం. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో చేతులు, కాళ్లు జలదరించినట్లుగా అనిపిస్తుంది.
రాత్రిపూట చల్లని అరికాళ్లు పెరిగిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కు సంకేతం. అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా పాదాలు చల్లగా మారుతాయి.