Kidney Failure: ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. కిడ్నీ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశం..!

Kidney Failure: ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. కిడ్నీ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశం..!

Update: 2022-03-17 14:30 GMT

Kidney Failure: ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. కిడ్నీ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశం..!

Kidney Failure: కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఒక వ్యక్తి జీవితం చాలా పరిమితులలో ఉంటుంది. మునుపటిలా తన జీవితాన్ని గడపలేకపోతాడు. ఎందుకంటే మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో వడపోతలా పనిచేస్తుంది. అందుకే కిడ్నీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మీ శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉంటుందో ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకుందాం.

మీడియా నివేదికల ప్రకారం మూత్రపిండాలు శరీరంలోని పొటాషియం, ఉప్పు స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఇది కాకుండా కిడ్నీ ప్రధాన పని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం. కొన్ని కారణాల వల్ల ఒక వ్యక్తి కిడ్నీ చెడిపోయినట్లయితే ఒక కిడ్నీ సహాయంతో సాధారణ జీవితాన్ని గడపవచ్చ. అయితే అతను తన గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మీ కిడ్నీ దెబ్బతింటుంటే మీరు ఆకలిని కోల్పోతారు. బరువు తగ్గుతారు. పాదాల వాపు మొదలవుతుంది. చర్మం పొడిబారుతుంది. దురద కలుగుతుంది. ఇది కాకుండా బలహీనత, అలసటతో పాటు తరచుగా మూత్రవిసర్జన సమస్య ఉంటుంది.

అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల పనితీరులో సమస్యలను కలిగిస్తోంది. అలాగే మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే కాఫీలో ఎక్కువగా కెఫీన్ ఉంటుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యాయనంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని తెలీంది. అంతేకాకుండా కాఫీ ఎక్కువగా తాగేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News