Health Benefits with Pineapple: అనాసతో ఆరోగ్య ప్రయోజనాలు...
Health Benefits with Pineapple | అనాస లేదా పైనాపిల్ (Pineapple) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును.
Health Benefits with Pineapple | అనాస లేదా పైనాపిల్ (Pineapple) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ ను పండిస్తారు.
వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.
అనాసతో ప్రయోజనాలు...
పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది. అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరోచనం సాఫీగా అవుతుంది.
* పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో సహాయపడుతుంది.
* పైనాపిల్ వికారం ఉపశమనంలో సహాయపడుతుంది.
* అనాస జుట్టు రాలడం తగ్గించడములో సహాయపడుతుంది.
అనాసలోని పోషకవిలువలు...
* నీరు : 87.8 గ్రా (ప్రతి వంద గ్రాములకు)
* ప్రోటీన్ : 0.4 మి.గ్రా
* కొవ్వు : 0.1 మి.గ్రా
* పిండి పదార్తం : 10.8 మి.గ్రా
* కాల్షియం : 20 మి.గ్రా
* పాస్పరస్ : 9 మి.గ్రా
* ఐరన్ : 2.4 మి.గ్రా
* సోడియం : 34.7 మి.గ్రా
* పొటాసియం : 37 మి.గ్రా
* మాంగనీస్ : 0.56 మి.గ్రా
* కెరోటిన్ : 18 మైక్రో.గ్రా,
* శక్తి : 46 కిలో కాలరీలు.
అనాసతో ఉపయోగాలు...
* రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
* ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
* పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
* పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
* జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.
* అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
* అనాసలోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
* పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
* అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
* అనాసలో ఉన్న ఫైబర్ మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది.
* అనాస వితమిన్ బి6 ఉంటుంది. గర్భవతులు ఈ పందు తినడమువలన వికారము నుండి ఉపశమనం పొందుతారు.