Health Benefits with Grapes: ద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలు...
Health Benefits with Grapes | ద్రాక్ష (స్పానిష్, పోర్చుగీస్ Uvas, ఫ్రెంచ్ Raisins, ఆంగ్లం Grapes, జర్మన్ Trauben) ఒక రకమైన పండ్ల చెట్టు.
Health Benefits with Grapes | ద్రాక్ష (స్పానిష్, పోర్చుగీస్ Uvas, ఫ్రెంచ్ Raisins, ఆంగ్లం Grapes, జర్మన్ Trauben) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని 'వైటికల్చర్' అంటారు.
ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగుచేస్తున్న పండ్లు. వీటి సాగు క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల కిందటే ఆసియా ప్రాంతంలో జరిగేది. అయితే అప్పుడు ఇప్పట్లా తినడానికి కాకుండా మధువు తయారీలో వాడేవాళ్ళు. ఇంకా ఇప్పుడు వీటితో జామ్‌లు, జెల్లీలు, కిస్మిస్‌లు తయారుచేస్తున్నారు.
ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతలలో ఇవి వైన్ తయారీకి పెట్టింది పేరు. క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో జర్మనీలోని రైన్‌లోయలో కేవలం మధువు తయారీకే వీటినిప్రత్యేకంగా సాగు చేసేవారు. అప్పటికే ఇవి సుమారు తొంభై వెరైటీలలో వుండేవి. యూరోపియన్ల ద్వారా ఇవిఅంతటా వ్యాపించాయి. అమెరికాలో పదిహేదవ శతాబ్దంలో ప్రవేశించాయి. అప్పుడు మెక్సికోలో కాలూనినా, వెంటనే కాలిఫోర్నియాలో స్థిరపడిపోయాయి. వీటికి ఎన్నో చీడపీడల దాడి సామాన్యం. అందులోనూ సాగులో విస్తృతంగా మందులు వాడవలసి వుంటుంది.
ద్రాక్షలోని ఔషధ గుణాలు....
♦ మలబద్దకం: ద్రాక్షలో ఉన్న సెల్యూలోజ్ గుణం వలన మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. అన్నప్రేవును మెరుగు పరచును. రోజూ కనీసం 350 గ్రాముల ద్రాక్ష తీసుకోవటం మంచిది.
♦ అజీర్ణం : అజీర్ణాన్ని కలిగించే పదార్థాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి మంచి అరుగుదలను పెంచును.
♦ ఆస్మా: ద్రాక్ష ఆస్మా వలన కలిగే ఆయాసంతగ్గించి, ఊపిరితిత్తుల బలం పెంచును.
♦ గుండె జబ్బులు: గుండెను బలాన్నిస్తాయి. నొప్పి వలన, దడ వలన కలిగే ఒత్తిడి ప్రభావం గుండెమీద తగ్గిస్తాయి.
♦ మెగ్రయిన్: ప్రతి రోజు ద్రాక్షరసం తాగడం వలన మైగ్రేయిన్ తగ్గడానికి ఎంతగానో అవకాశం ఉంది.
♦ మూత్ర పిండ సమస్యలు : ద్రాక్షలో గల పొటాషియం వలన మూత్రపిండాల వ్యాధులు చక్కగా తగ్గుతాయి. ఉబ్బు కామెర్లు, మూత్ర పిండాల లోని రాళ్లు తగ్గించటానికి ద్రాక్ష పనిచేయును.
♦ లివర్ సమస్యలు : కాలేయానికి ఉత్తేజ పరచును. పైత్య రసమును సరిగ్గా తయారుచేయుటలో ఉపకరించును.
♦ పిల్లల వ్యాధులు: రక్త కణాల తయారగుటలో ద్రాక్ష ఉపయోగపదుతుంది. పిల్లలకి పళ్ళు వచ్చే టపుడు వచ్చే సమస్యలకి ద్రాక్ష రసం చాలా మంచిది.
♦ కురుపులు: కురుపుల మీద ద్రాక్ష రసం పోసి గాజు కక్షాలో పరచి ఉంచితే కురుపులు త్వరగా మానతాయి.
♦ దంత వ్యాధులు: చీము పట్టిన దంతాలు చిగుర్లు ద్రాక్ష వాడకం వలన క్రమేణా మాని, ఆరోగ్యంగా తయారవుతాయి.
♦ ఆల్కాహానిజం :ద్రాక్ష రసం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆల్కహాలు మీద ఆశ తగ్గి ద్రాక్ష లోని శక్తిని పొంది, రక్త శుద్ధి జరుగును.
ద్రాక్షలోని పోషక విలువలు...
♦ తేమ శాతం - 92 శాతం,
♦ కార్బోహైడ్రేట్స్ - 7 శాతం,
♦ కాల్షియం - 20 మి.గ్రా,
♦ పాస్ఫరస్ - 20 మి.గ్రా,
♦ విటమిన్ సి - 31 మి.గ్రా,
విటమిన్స్ - ఎ.బి.కాంప్లెక్స్