Health Benefits with Banana: రోజుకు ఒక్క అరటిపండు తినడంతో కలిగే ప్రయోజనాలు...
Health Benefits with Banana: అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్) మాత్రమే.
Health Benefits with Banana: అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్) మాత్రమే. ఇది మూసా అను ప్రజాతికి, మ్యుసేసియె కుటుంబానికి చెందినద. కూర అరటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా 2 నుండి 3 మీటర్లు పొడుగు) 4 నుండి 8 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. అరటి పండులో 80% లోపల ఉన్న తినగల పదార్థము, పైన తోలు 20% ఉంటుంది.
వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము (హస్తము) అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాలలో (భారత దేశంతో సహా) సాగు చేశారు. చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచి, వాసన అవి పక్వానికి వచ్చే దశలో ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోవడం వల్ల వీటిని ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డిగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకొనిరారు.
భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు.
పోషక విలువలు..
* అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది.
* 23% కార్బోహైడ్రేటులు,
* 1% ప్రోటీనులు,
* 2.6% ఫైబరు ఉంటుంది.
ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది.
అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు.
అరటి వాడకం, ప్రయోజనాలు...
* అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
* ఆహారంగా ప్రధానమైనది. భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పెళ్లి భోజనాలలో అరటి పండు ఖచ్చితంగా ఉండాల్సిందే.
* అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు.
* చాలా మంది ఆరోగ్యరీత్యా పరిమిత ఆహారం తీసుకునేవారు(డైటింగ్ చేసేవారు), వ్యాయామశాలకు వెళ్ళేవారు తగిన శక్తి కోసం ముందు అరటి పండు తింటారు. ఇందులో సరైన పోషకాలు ఉంటాయి.
* రోజు అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది.
* శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్) ను తొలగిస్తుంది.
* జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.
* అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.