Health Benefits with Almond: బాదంతో ఆరోగ్య ప్రయోజనాలు...
Health Benefits with Almond | బాదం (ఆంగ్లం Almond) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.
Health Benefits with Almond | బాదం (ఆంగ్లం Almond) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు. బాదం గింజలు బలవర్థకమైన ఆహారం. జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి. బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది. తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
బడంపప్పును తినడం ద్వారా గుండె పనితీరు మేరుగుపడుతుందని బ్రిటన్ లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడల్లా గుండె కొట్టుకొనే రాతులో హెచ్చ తగ్గులు చోటు చేసుకున్తయన్నారు. ఆ సమయంలో ఒత్తిడి నుంచి బయటపడేందుకు, ప్రతికూల ప్రభావాల నుంచి గుండెను కాపాడేందుకు బాదంలోని పోషక విలువలు ఊతమిస్తాయని పలువురు వాలంటీర్ లపై జరిపిన అధ్యయనం అనంతరం చెప్పారు.
143 గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు..
* తేమ : 6.31గ్రాం
* ప్రోటిను : 30.24గ్రాం
* పిండిపదార్థాలు : 30.82గ్రాం
* చక్కెర : 6.01గ్రాం
* పీచుపదార్థం : 17.9
* శక్తి : 828Kcal
* మొత్తం ఫ్యాట్ : 71.4గ్రాం
* బాదం పప్పులో ఐరన్(ఇనుము),కాల్షియం,మెగ్నిసియం,జింకు,ఫాస్పరసు, సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి.
బాదంలోని పోషక విలువలు...
బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్.
* కొలెస్ట్రాల్ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి.
*తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకని దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
* మధుమేహానికి : మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్నిపెంచుతుంది.
* మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.
* బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
* పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది.
అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా, ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది