Health Tips: నేరేడు పండు..ఔషధాలు మెండు..షుగర్, హార్ట్ సమస్యలన్నింటికీ చెక్.!

Health Tips: నేరేడుపండు. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో ఈ పండు మార్కెట్లో లభిస్తుంది. ఈ పండు రుచి తీపిగా, పుల్లగా ఉంటుంది. ఈ పండులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.

Update: 2024-06-21 11:52 GMT

Health Tips: నేరేడు పండు..ఔషధాలు మెండు..షుగర్, హార్ట్ సమస్యలన్నింటికీ చెక్.!

Health Tips: నేరేడు ఔషధ గుణాలతో నిండి ఉన్న పండు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు ఈ పండును వరంగా భావిస్తారు. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఈ పండు చాలా సహాయపడుతుంది. నేరేడు పండు మాత్రమే కాదు..గింజలు, ఆకులు, బెరడులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

మధుమేహం:

తప్పుడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులోనే ఈ వ్యాధి బారినపడుతున్నారు. బ్లడ్ షుగర్ ను సహజ పద్ధతిలో నియంత్రించడంలో నేరేడు పండు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నేరేడు పండు తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. షుగర్ వల్ల వచ్చే అధిక మూత్ర విసర్జన, దాహాన్ని నియంత్రించడంలో మేలు చేస్తుంది.

ఇమ్యూనిటీ:

ఈరోజుల్లో చాలా మంది బలహీనపమైన రోగనిరోధకశక్తితో బాధపడుతున్నారు. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే నేరేడు పండు మంచి ఎంపిక. ఇమ్యూనిటీని పెంచే పదర్దాలు, విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు సోడియం, కాల్షియం, ఐరన్, కార్బొహైడ్రేట్లు నేరేడు పండులో ఉన్నాయి.

గుండె ఆరోగ్యం:

మన శరీరంలో అన్ని అవయవాల్లో అత్యంత ముఖ్యమైంది గుండె. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో నేరేడు పండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ గుండెను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా నేరేడు పండును తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇతర ప్రయోజనాలు :

-జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలుపుకుని తాగితే శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది.

-మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మ, నేరేడు రసం రెండు చెంచాలు నీళ్లులో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.

-జీర్ణశక్తిని పెంచడంతోపాటు గ్యాస్ లాంటి సమస్యలకు చక్కని పరిష్కారం అందిస్తుంది.

-నోటిపూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం ఉన్నవాళ్లు నేరేడు ఆకుల రసాన్ని రోజు పుకిలించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

-విరేచనాలతో బాధపడేవారు రెండు, మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే విరేచనాలు తగ్గుతాయి.

-నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

-మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News