Health Benefits of Ginger: అల్లంతో ఆరోగ్యం
Health Benefits of Ginger: అల్లాన్ని వాడుకునే ముందు దాని పై పొట్టును తీసి వాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Health Benefits of Ginger: అల్లం ఈ పేరు తెలియని వారు ఉండరు. వేర్వేరు ప్రాంతాల ను బట్టి వివిధ పేర్లతో పిలవొచ్చు కానీ అల్లం లేదా ఇంగ్లీషు జింజర్ అని అంటారు. పురాతన కాలం నుండి ప్రజలు వంట మరియు ఔషధల్లో అల్లం ఉపయోగించారు. ప్రతి ఇంట్లో ఏదో రూపంలో అల్లాని వాడుతూ నే వుంటారు. సరే అల్లం దాని ఆరోగ్యం గురించి ఇపుడు మన లైఫ్ స్టైల్ లో చూద్దాం.
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు 20.మి.లీ. అల్లం రసం 20 మి.లీ తేనె కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే సుఖ విరోచనం అయ్యి, కడుపులోని వాయువులు కూడా బయటికి పోయి, నొప్పి తగ్గుతుంది. అల్లాన్ని వాడుకునే ముందు దాని పై పొట్టును తీసి వాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా ఉదయం లేచిన వెంటనే పడి కడుపున అల్లం రసం తాగితే నీ బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా మీరు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దగ్గు, జలుబు నుండి పూర్తిగా మనం కోల్పోవచ్చు. అల్లం రసంలో లో ఒక స్పూన్ తేనె, పసుపు, నిమ్మరసం కలిపి తీసుకున్న గాని ఉపయోగం ఉంటుంది.(వీటిలో ఒకసారికి ఒకటి మాత్రమే అల్లం రసంతో కలుపుకుని తీసుకోవాలి). అల్లం రసం ఇష్టంలేని వారు మూడు పూటలా చిన్న అల్లం ముక్కను నోట్లో దవడన పెట్టి కొంచెంకొంచెంగా అల్లం రసం తీసుకోవచ్చు.
ఇక అల్లం రసాన్ని వేడి నీటిలో తీసుకుంటే చాలా మంచిది. అల్లం క్రమంగా వాడడం వల్ల మన బాడీ లో ఇమ్యూనిటీపవర్ పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. అల్లం రసంలో ఎక్కువ శాతంలో విటమిన్ సి, మెగ్నీషియం ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కేవలం ఇమ్యూనిటీపవర్ అనిపించడమే కాకుండా కీళ్ల నొప్పులు ఇతర నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా అల్లం రసాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల వాటి నుండి ఉపశమనం దొరుకుతుంది. ఇక బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు అయితే అల్లం రసం ఒక వజ్రాయుధం లా పనిచేస్తుంది.
ప్రతిరోజు కొంత మొత్తంలో అల్లం రసాన్ని సేవిస్తే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా అజీర్తి తో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఇక మనకు సర్వసాధారణంగా వచ్చే దగ్గు జలుబు వీటి నుండి మనం బయట పడాలంటే మనకు అందుబాటులో ఉన్న ఏకైక ట్రీట్మెంట్ అల్లం రసం. అల్లం రసాన్ని మోతాదులో సేవిస్తే ఈ రెండింటి నుండి మనం బయట పడవచ్చు.