Health Benefits of Guava: ప్రతి రోజు జామ పండు తినడం వల్ల కలిగే ఉపయోగాలు..

Health Benefits of Guava: జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు.

Update: 2020-08-15 04:32 GMT
Guava

Health Benefits of Guava: జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆయిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది. ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే జామపండ్లు లభించేవి..కానీ ఇప్పుడు 365 రోజులు జామ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీరానికి ఎంతో మేలు చేసే జామ పండ్లను కచ్చితంగా తిని తీరాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి.జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని

వాసనతో దృఢమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.

ఉపయోగాలు:

* వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది, జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నాశీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది.

* ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది.. ఆసియా దేశాలలో విసృఉతంగా పండుతుంది. కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను " సి " ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే  రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది.

* చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే " పెక్టిన్" జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.

* జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

* నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.

పోషక విలువలు:

పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు..

* నీరు: 81.7 గ్రా,

* కొవ్వు: 0.3 గ్రా,

* ప్రోటీన్: 0.9 గ్రా,

* పీచు పదార్తాలు: 5.2 గ్రా,

* సి.విటమిన్: 212 మి.గ్రా,

* పాస్పరస్: 28 మి.గ్రా,

* సోడియం: 5.5 మి.గ్రా,

* పొటాసియం: 91 మి.గ్రా,

* కాల్సియం: 10 మి.గ్రా,

* ఐరన్: 0.27 మి.గ్రా,

* శక్తి: 51 కిలో కాలరిలు.


Tags:    

Similar News