Yellow Teeth: దంతాలు పసుపురంగులోకి మారాయా.. చిటికెలో తొలగించండి..!

Yellow Teeth: అందమైన ముఖం ఉంటే సరిపోదు దంతాలు కూడా తెల్లగా ఉండాలి.

Update: 2022-09-19 08:30 GMT

Yellow Teeth: దంతాలు పసుపురంగులోకి మారాయా.. చిటికెలో తొలగించండి..!

Yellow Teeth: అందమైన ముఖం ఉంటే సరిపోదు దంతాలు కూడా తెల్లగా ఉండాలి. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే పసుపు పళ్ళు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు అందరిలో నవ్వడం కష్టం అవుతుంది. సాధారణంగా దంతాలు నిత్యం శుభ్రం చేయకపోవడం వల్ల మురికిగా మారుతాయి. అంతే కాకుండా టీ, కాఫీ, పాన్, సిగరెట్, గుట్కా, పొగాకు వంటి చెడు వ్యసనాల వల్ల పసుపు దంతాలుగా మారుతాయి. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ముందుగా చెడు అలవాట్లను వదిలివేయండి. వంటగదిలో దొరికే కొన్ని మసాలల ద్వారా దంతాల పసుపును తొలగించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. తెల్లగా, మెరిసే దంతాలు పొందడానికి ముందుగా నారింజ తొక్క, టమోటా, ఉప్పు తీసుకోవాలి. ఈ మూడింటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను టూత్ బ్రష్‌పై అప్లై చేసి దంతాలను శుభ్రం చేయాలి. ఇవి నోటిలో పెరిగే బ్యాక్టీరియాపై తీవ్రంగా దాడి చేస్తాయి.

2. పసుపు పళ్లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, ఉప్పు, కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా తయారు చేసి ఆపై వేలు లేదా టూత్ బ్రష్ సహాయంతో పళ్లను బ్రష్ చేయాలి. ఈ పేస్ట్‌ను నెలకు 2 సార్లు మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి. సున్నితమైన దంతాలు ఉన్నవారు ఈ పద్ధతిని పాటించకూడదు.

3. వేపలోని ఔషధ గుణాల గురించి అందరికీ తెలిసిందే. రోజూ వేపపుల్లతో దంతాలను శుభ్రం చేస్తే దుర్వాసన వచ్చే క్రిములను చంపడమే కాదు దంతాల పసుపు రంగును కూడా తొలగిస్తుంది.

4. మీరు ఏదైనా తిన్నప్పుడు తర్వాత పళ్లని, నోటిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల దంతాలలో ఇరుక్కున్న ఆహారం బయటకు వస్తుంది. దంతాలు ఎప్పడు క్లీన్‌గా ఉంటాయి.

Tags:    

Similar News