Hair Care Tips: జుట్టు విపరీతంగా రాలుతుందా.. ఇది అప్లై చేయకుంటే బట్టతలే..!
Hair Care Tips: నేటి రోజుల్లో చాలామంది జుట్టురాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.
Hair Care Tips: నేటి రోజుల్లో చాలామంది జుట్టురాలే సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. చెడు జీవనశైలి, పోషకాహార లోపం, రసాయన ఉత్పత్తులు వాడటం జుట్టురాలడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యని సకాలంలో ఆపకపోతే బట్టతల వచ్చేస్తుంది. జుట్టు రాలడం ఆగాలంటే ముందుగా వాటిని ధృడంగా చేయడం అవసరం. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. బట్టతల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
కొబ్బరి నూనెను వేడి చేసి బాగా జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కడగడానికి ముందు నూనెను అప్లై చేసి ఆపై షాంపూతో జుట్టును కడగాలి. కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కొబ్బరినూనె జుట్టును మాయిశ్చరైజింగ్ చేస్తుంది. వెంట్రుకలని బలోపేతం చేస్తుంది.
కొబ్బరినూనె ఎండ, దుమ్ము, ధూళి నుంచి జుట్టును కాపాడుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను జుట్టుకు దూరంగా ఉంచుతాయి. ఇది జుట్టు మూలాల నుంచి చుండ్రు, మురికిని తొలగించడానికి పనిచేస్తుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. కొబ్బరి నూనె జుట్టును తేమగా మార్చడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు పొడిని తొలగించి మెరిసేలా చేస్తాయి. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది.