Green Tea: ఈ సమయంలో గ్రీన్ టీ అస్సలు తాగకూడదు..!
Green Tea: ఈ సమయంలో గ్రీన్ టీ అస్సలు తాగకూడదు..!
Green Tea: గ్రీన్ టీ అనేది ప్రయోజనాల నిధిగా చెబుతారు. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు గ్రీన్ టీ తాగాలని సూచిస్తారు. అయితే ఈ హెర్బల్ టీ త్రాగడానికి సరైన సమయం తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతాయి. గ్రీన్ టీ ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
1. క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి. దీనిని నివారించడానికి తప్పనిసరిగా గ్రీన్ టీ తాగాలి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ట్యూమర్లు, క్యాన్సర్ కణాలను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
2. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది
గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది రక్త నాళాలలో అడ్డంకిని తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
3. స్కిన్ ఇన్ఫెక్షన్ నివారణ
మన చర్మం దెబ్బతిన్నప్పుడు గ్రీన్ టీ తాగడం ఉత్తమం. ఇందులో ఉండే ఔషధ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. ఇది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. స్కిన్ టోన్ సమానంగా మారుతుంది. మొటిమలు తక్కువగా వస్తాయి.
4. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
జీవక్రియను పెంచుతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు క్రమంగా తగ్గుతుంది. వ్యాయామానికి ముందు తాగడం మంచిది. అప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది.
5. గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి..?
భోజనానికి ఒక గంట ముందు గ్రీన్ టీ తాగడం ఉత్తమం. ఎందుకంటే ఇందులో టానిన్లు ఉంటాయి. ఖాళీ కడుపుతో ఎప్పుడూ తాగకూడదు. ఖచ్చితంగా టీతో పాటు ఏదైనా తినండి. మీరు ఒక రోజులో 3 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. నిద్రవేళకు ముందు తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది.