ఈ అలవాట్లని ఇప్పుడే వదిలేయండి.. లేదంటే దంతాలకి పెద్ద నష్టం..!

ఈ అలవాట్లని ఇప్పుడే వదిలేయండి.. లేదంటే దంతాలకి పెద్ద నష్టం..!

Update: 2022-10-24 05:45 GMT

ఈ అలవాట్లని ఇప్పుడే వదిలేయండి.. లేదంటే దంతాలకి పెద్ద నష్టం..!

Health Tips: ప్రతి ఒక్కరు శుభ్రమైన, దృఢమైన, మెరిసే దంతాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి నవ్వినప్పుడు అతని మెరిసే దంతాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అందానికే అందం తెస్తాయి. అయితే చాలామంది దంతాలని సరిగ్గా చూసుకోరు. బ్రషింగ్ నుంచి ఇతర అలవాట్ల వరకు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1. చాలా మంది శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. వాటిని నోటితో నేరుగా తాగుతారు. అయితే ఇలా చేయడం దంతాలకి మంచిది కాదు. శీతల పానీయాలు తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించాలి. దీనివల్ల శీతల పానీయాలు దంతాలను దెబ్బతీయలేవు.

2. దంతాలను బలంగా, శుభ్రంగా ఉంచడానికి తరచుగా బ్రష్ చేయాలి. అయితే బ్రషింగ్‌ అనేది సరైన మార్గంలో చేయాలి. లేదంటే దంతక్షయానికి కారణం అవుతుంది. బ్రెషింగ్‌ సున్నితంగా ఉండాలి. గట్టిగా ఉండకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

3. ధూమపానం హానికరం. ఇది దంతాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా చిగుళ్ళు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ధూమపానం అలవాటు మానేయడం మంచిది.

4. ఐస్‌ గడ్డలని ఎప్పుడు పళ్లతో డైరెక్ట్‌గా నమలకూడదు. దీని వల్ల దంతాలు బలహీనంగా మారుతాయి. అంతేకాదు సెన్సిటివిటి సమస్య ఎదురవుతుంది. వెంటనే ఈ అలవాటుని మార్చుకోండి.

5. చాలా మందికి చిన్నప్పటి నుంచి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే వదిలేయండి. లేదంటే చాలా నష్టపోతారు. గోళ్లు కొరకడం వల్ల దంతాలు పగుళ్లు ఏర్పడతాయి. దీంతో పాటు నోటిలో సూక్ష్మక్రిములు పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది.

Tags:    

Similar News