Vomiting: ప్రయాణంలో వాంతుల సమస్యలా.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. లాంగ్ జర్నీకి రెడీ అయిపోతారంతే..!
Vomitings: లాంగ్ డ్రైవ్ లేదా లాంగ్ జర్నీ చాలా మంది కోరుకుంటారు. కానీ, కొంతమందికి ప్రయాణంలో వాంతులు, వికారం, తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. ఈ చిన్న చిట్కాలతో ఈజీగా బయటపడొచ్చు.
Vomiting: చాలా మంది ప్రయాణాలు ఇష్టపడతుంటారు. ఎందుకంటే జర్నీ చాలా సరదాగా ఉండటమే కాదు, జీవితంలో కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ అనుభవం కొంతమందికి అస్సలు నచ్చదు. బస్సులో, రైలులో, కారులో లేదా విమానంలో లేదా మరేదైనా వాహనంలో జర్నీ చేస్తున్నప్పుడు వీరికి వాంతులు, తల తిరగడం, వికారం లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఇలాంటి వారు ప్రయాణాన్ని అస్సలు ఇష్టపడరు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే, ప్రయాణంలో ఈ 3 వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది.
1. నిమ్మకాయ..
నిమ్మకాయలోని ఔషధ గుణాల గురించి మనందరికీ తెలుసు. అయితే ఇది ప్రయాణ సమయంలో వాంతులు, వికారం మరియు విశ్రాంతి లేకుండా మీకు సహాయపడుతుందని మీకు తెలుసా. మీ వస్తువులతో పాటు నిమ్మకాయను తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాంతుల సమస్య పెరిగినప్పుడు దాని రసాన్ని లేదా వాసన చూడాలి. అలాగే నిమ్మకాయను వాటర్ బాటిల్‌లో కూడా ఉంచుకోవచ్చు. ఇది ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది.
2. అరటిపండు..
మాములుగా అందరూ అరటిపండు తింటూనే ఉంటుంటారు. కానీ, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా అరటిపండును మీ బ్యాగ్‌లో పెట్టుకుంటే మంచిది. ఈ పండు పొటాషియంను పునరుద్ధరించే గుణం కలిగి ఉంటుంది. వాంతుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. లాంగ్ డ్రైవ్ సమయంలో వాంతులు లేదా తల తిరగడం వంటి సందర్భాల్లోనూ అరటిపండు తీసుకుంటే కంట్రోల్ అవుతుంది.
3. అల్లం..
అల్లం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగించే ఒక మసాలా. ఇది ప్రయాణంలో వాంతులకు సమస్యకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది వికారం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది39 మరియు కడుపు యొక్క చికాకును తగ్గించడం ద్వారా తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. సమస్య పెరిగినప్పుడు పచ్చి అల్లాన్ని నమిలితే చాలా ఉపమనం కలుగుతుంది. కావాలంటే అల్లం మిఠాయి, అల్లం టీ, అల్లం కలిపిన వేడినీళ్లు కూడా థర్మాస్ ఫ్లాస్క్ లో పెట్టుకోవచ్చు.