Benefits of Walking: 30 నిమిషాల నడకతో నాలుగు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Update: 2021-11-24 10:50 GMT

30 నిమిషాల నడకతో నాలుగు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Walk Benefits: కరోనా దెబ్బకి ఇప్పుడు అందరు ఆరోగ్యంపై దృష్టి సారించారు. నిత్యం వ్యాయామం, రన్నింగ్‌, వాకింగ్‌, యోగా వంటివి చేస్తున్నారు. అయితే ఉద్యోగులు చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేయడం వల్ల విపరీతంగా బరువు పెరిగారు. దీంతో స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు శారీరక శ్రమ చేయాలి. అధికంగా నిల్వ ఉన్న కేలరీలను కరిగిస్తేనే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ వీరికి సమయం ఉండదు. అలాంటి సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంతం ఒక 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. బోలు ఎముకల వ్యాధి

ప్రస్తుతం 30 ఏళ్లలోపు యువతలోనూ ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఎముకలలో తగ్గిన BMD వ్యాధి సమయంలో పగుళ్లు ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు భవిష్యత్తులో మోకాలు, తుంటి దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా నడిచేవారిలో ఆస్టియోపోరోసిస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుంది.

2. అధిక బీపీ నివారణ

హై బీపీ, కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. మీరు అధిక BP ఉన్న రోగి అయితే మీ శరీర కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లయితే ఖచ్చితంగా క్రమం తప్పకుండా నడవండి. దీంతో మీ BP, చెడు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

3. మధుమేహం నివారణ

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే వాకింగ్‌ అనేది చాలా ముఖ్యం. మీరు ఏ సందర్భంలోనైనా నడవాలి. నడక మధుమేహానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల డయాబెటిక్ పేషెంట్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీనితో పాటు వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు కూడా రక్షించబడుతారు.

4. ఒత్తిడి నుంచి ఉపశమనం

ఈ రోజుల్లో ఒత్తిడి కూడా చాలా సాధారణ సమస్య. ఒత్తిడి వల్ల ఊబకాయం, మెదడు సంబంధిత, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కానీ క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Tags:    

Similar News