Health Tips: చలికాలం కాళ్లు,చేతులు వెచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: చలికాలం కాళ్లు,చేతులు వెచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: శీతాకాలంలో చలిని నివారించడానికి అందరు స్వెటర్ల లాంటి మందంపాటి దుస్తులని ధరిస్తారు. వీటిని ధరించడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. కానీ కాళ్లు చేతులు మాత్రం చల్లగా ఉంటాయి. ఇలాంటి సమయంలో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. ఎందుకంటే శరీరంలోని మిగిలిన భాగాల కంటే తక్కువ ఆక్సిజన్ మీ పాదాలకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో కాళ్లు చేతులని వేడి చేసుకోవాలి. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.
సాక్స్ ధరించాలి
తరచుగా శీతాకాలంలో ప్రజలు నిద్రపోయే ముందు సాక్స్‌లను తీసివేస్తారు. కానీ చలికాలంలో పాదాలకు సాక్స్ వేసుకుని నిద్రపోతే పాదాలు వెచ్చగా ఉంటాయి. కాబట్టి వెచ్చదనం కోసం సాక్స్ ధరించి నిద్రించండి.
పని చేయండి
శీతాకాలంలో చలి కారణంగా ప్రజలు ఎక్కువగా పనిచేయరు. చాలా సమయం పడుకోవడానికి శ్రద్ద చూపుతారు. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో అరికాళ్ళు, అరచేతులు మరింత చల్లగా మారుతాయి. అందుకే ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలి. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
కాళ్లు చేతులకి మసాజ్
రాత్రి పడుకునే ముందు పాదాలు, అరచేతులు, కాలి వేళ్లను ఆవాలు లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.దీని కారణంగా శరీరంలో వేడి అలాగే ఉంటుంది.
వెచ్చని నీటిలో పాదాలు
ఒక టబ్ లేదా బకెట్‌లో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కొద్దిగా రాతి ఉప్పు కలపండి. అప్పుడు మీ పాదాలను నీటిలో ఉంచండి. తర్వాత పొడి టవల్‌తో తుడిచి, మెత్తని బొంతలో పడుకోండి. ఇది మీ పాదాల కండరాలకు ఉపశమనం ఇస్తుంది. దీని కారణంగా మీ అరికాళ్ళు వెచ్చగా ఉంటాయి.