వర్షాకాలం పిల్లలకి చాలా ఎఫెక్ట్‌.. రోగనిరోధక శక్తి పెంచాలంటే ఇవి చేయాల్సిందే..!

Childs Immunity: ఎండాకాలం ముగిసి వర్షాకాలంలో చినుకులు పడినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

Update: 2022-08-22 09:03 GMT

వర్షాకాలం పిల్లలకి చాలా ఎఫెక్ట్‌.. రోగనిరోధక శక్తి పెంచాలంటే ఇవి చేయాల్సిందే..!

Childs Immunity: ఎండాకాలం ముగిసి వర్షాకాలంలో చినుకులు పడినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌ వ్యాధులని కూడా మోసుకొస్తుంది. అయితే పిల్లలకు ఈ ప్రమాదం గురించి తెలియదు. వారు తరచుగా వర్షంలో ఆటలాడుతారు. ఈ సందర్భంలో వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కరోనా వైరస్ తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే తగినంత రోగనిరోధక శక్తి లేకపోతే శరీరంపై అనేక వ్యాధులు దాడి చేస్తాయి. మారుతున్న సీజన్‌లో పిల్లలని వ్యాధులకి ఎలా దూరంగా ఉంచాలో తెలుసుకుందాం.

1.ఆరోగ్యకరమైన ఆహారం

పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలి. లేదంటే శరీరానికి తగినంత పోషకాహారం లభించదు. దీనివల్ల సీజనల్‌ వ్యాధులని నివారించడం కష్టమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పాలు, రోటీ, ఓట్స్, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను తినిపిస్తే రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.

2.సరైన నిద్ర

ఆరోగ్యకరమైన పెద్దలు సుమారు 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. కానీ పిల్లల విషయంలో ఇది సరిపోదు. చాలా మంది ఆరోగ్య నిపుణులు 10 నుంచి 14 గంటలు నిద్ర పోవాలని సూచిస్తారు. నవజాత శిశువులు 15 గంటలు నిద్రపోవాలి. దీని వల్ల వారి రోగనిరోధక శక్తికి ఎలాంటి ముప్పు ఉండదు.

3.మాస్క్ ధరించండి

కరోనా వైరస్ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించేలా చూడాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News