Health Tips: చలికాలంలో దగ్గు సమస్య ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: చలికాలంలో దగ్గు సమస్య ఉంటే ఈ చిట్కాలు పాటించండి..!
Health Tips: చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే అంటువ్యాధులు త్వరగా ప్రబలుతాయి. ఈ సీజన్‌లో దగ్గు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది అంత తేలికగా తగ్గదు. దీనిని వదిలించుకోవాలనుకుంటే పొడి అల్లం ఉపయోగిస్తే మంచిది. ఇది దగ్గును ఏ విధంగా నయం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.
పొడి అల్లం ఔషధ గుణాలు
ఎండు అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు వాపు, నొప్పిని తొలగించడంలో సహాయపడతాయి.
ఎండు అల్లం నీరు
ఎండు అల్లం తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు సమస్య తీరుతుంది. అలాగే వేడి నీటిలో అర చెంచా పొడి అల్లం పొడిని కలిపి మరిగించాలి. దానిని వడబోసి 1లేదా 2 స్పూన్ల తేనె కలపాలి. ఈ నీటిని రోజుకు 2 లేదా 3 సార్లు తాగాలి. దగ్గు తగ్గడం మొదలవుతుంది.
పొడి అల్లం, తేనె
మీరు తేనెతో పొడి అల్లం కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం పొడి అల్లం పొడిలో నాలుగు చెంచాల తేనె కలపాలి. రోజుకు మూడు సార్లు తినాలి. దగ్గును దూరమవుతుంది.
టీలో పొడి అల్లం
పొడి అల్లం ప్రభావం వేడిగా ఉంటుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది. దగ్గు, గొంతు నొప్పిని వదిలించుకోవడానికి పొడి అల్లం పొడిని గ్రీన్ టీ, దాల్చిన చెక్క లేదా సాదా టీతో కలిపి మరిగించి తాగాలి. మంచి ఉపశమనం లభిస్తుంది.