Headache: తలనొప్పికి ఇలా చేస్తే తక్షణ ఉపశమనం.. అవేంటంటే..?
Headache: ప్పుడైనా తలనొప్పి ఉంటే మందులు వేసుకోకూడదు. తలనొప్పిని నివారించడానికి ఆయుర్వేద పద్దుతులని పాటించాలి.
Headache: ఈ రోజుల్లో తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. పని ఒత్తిడి, శబ్ధ కాలుష్యం వల్ల తరచుగా ఈ నొప్పి ఏర్పడుతుంది. వినడానికి ఇది చిన్న సమస్యే అనిపించినప్పటికీ దీనివల్ల ఏ పనిపై శ్రద్ధ చూపలేరు. దీనికి మందులు వాడటం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఉంటాయి. ఎప్పుడైనా తలనొప్పి ఉంటే మందులు వేసుకోకూడదు. తలనొప్పిని నివారించడానికి ఆయుర్వేద పద్దుతులని పాటించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లం టీ
అల్లం ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది. అందుకే శరీరంలోని చాలా సమస్యలకి ఇది పరిష్కారం చూపుతుంది. అల్లం తలనొప్పిని తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ముందుగా అల్లం చూర్ణం తీసుకొని అందులో కొద్దిగా నీరు కలపాలి. దీనిని స్టవ్‌పై బాగా మరిగించి వడకట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి బయటపడవచ్చు.
ఆయిల్ మసాజ్
కొన్ని రకాల నూనెలలో అద్భుత ఔషధగుణాలు దాగి ఉంటాయి. ఇవి కూడా తలనొప్పిని తగ్గిస్తాయి. మైగ్రేన్ వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీనిని తలపై రుద్దుతూ మసాజ్ చేయాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
మెగ్నీషియం ఆహారాలు
శరీరం సక్రమంగా పనిచేయాలంటే మెగ్నీషియం కచ్చితంగా అవసరమవుతుంది. ఇది ఎముకలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వల్ల ఆకలి లేకపోవడం, వికారం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి. మెగ్నీషియం లోపం తలనొప్పికి కారణం అవుతుందని గుర్తుంచుకోండి. ఇలాంటి సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలని తీసుకోవడం ఉత్తమం.