Monsoon Infections: వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువ.. ఇవి మరిచిపోతే ప్రమాదంలో పడుతారు..!
Monsoon Infections: వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Monsoon Infections: వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆస్పత్రిలో బిల్లు పెరిగిపోతుంది.
ముఖ్యంగా ఈ సీజన్‌లో మురికి నీరు, చెడు ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వీటి వల్ల అనేక రోగాలు సంభవిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే ఫ్లూ, వైరల్ ఫీవర్, న్యుమోనియా, టైఫాయిడ్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్, చర్మ వ్యాధులు, దగ్గు వంటి సమస్యలకి గురవుతారు. సకాలంలో వైద్యం అందకుంటే ఈ వ్యాధులు ప్రాణాంతకంగా మారుతాయి. ఈ సీజన్‌లో ఏయే పద్ధతులను పాటిస్తే ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చో తెలుసుకుందాం.
స్ట్రీట్ ఫుడ్ తినవద్దు
ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు చాలా వరకు కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో స్ట్రీట్ ఫుడ్ తినడం మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
జ్వరం వస్తే ఆస్పత్రికి
చాలా వైరల్ ఇన్ఫెక్షన్లు జ్వరంతో మొదలవుతాయి. ఈ పరిస్థితిలో జ్వరం ఉంటే అది రెండు రోజుల కంటే ఎక్కువగా కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంతంగా మెడికల్ షాపులో మందులను తీసుకొని వాడకూడదు. శరీర ఉష్ణోగ్రతను రోజుకు రెండుసార్లు తనిఖీ చేయాలి. 100 కంటే ఎక్కువ ఉంటే చికిత్స అవసరమని గుర్తుంచుకోండి.
పుష్కలంగా నిద్ర
ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి పెరగాలంటే మంచి నిద్ర అవసరం. రాత్రి తొందరగా నిద్రపోవడానికి ఉదయం తొందరగా మేల్కొలపడానికి ప్రయత్నించండి. రాత్రిపూట కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట ఎక్కువగా తినకుండా ఉండండి. నిద్రించడానికి కొన్ని గంటల ఫోన్‌ని ఉపయోగించడం ఆపివేయండి.
ఆహారం పట్ల శ్రద్ధ
వర్షాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో ప్రోటీన్, ఫైబర్ ఆహారాలని చేర్చుకోవాలి. ఉదయం భోజనం చేసి మధ్యాహ్నం పండ్లు తినాలి. అప్పుడే ఎటువంటి వ్యాధులకి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.