Coriander: కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!
Coriander: తెలుగు రాష్ట్రాల్లో కొత్తమీర లేనిదే మహిళలు దాదాపు ఏ వంటకాలు చేయరు.
Coriander: తెలుగు రాష్ట్రాల్లో కొత్తమీర లేనిదే మహిళలు దాదాపు ఏ వంటకాలు చేయరు. మాంసాహారమైనా, శాఖాహారమైనా కొత్తిమీర ఉండాల్సిందే. ఇది వంటలకి అదనపు రుచిని అందిస్తుంది. దీని వాసన అద్భుతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజువారీ ఆహారంలో కొత్తిమీర తీసుకుంటే చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. ఆయుర్వేదం ప్రకారం కొత్తి మీర ఔషధ గుణాలని కలిగి ఉంటుంది.
కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
కాలేయ వ్యాధులకు చెక్
కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలు, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
ప్రేగు సంబంధిత వ్యాధులకు ముగింపు
కొత్తిమీర తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె జబ్బులు దూరం
కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇది చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
ఆహారంలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.