Egg: గుడ్డు తాజాగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!
Egg: గుడ్డు తాజాగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి..!
Egg: ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ, నకిలీ వస్తువులను విక్రయించే వ్యాపారం జోరుగా సాగుతోంది. చాలా మంది వ్యాపారులు ఎక్కువ లాభం కోసం వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఈ లిస్టులో కోడిగుడ్లు కూడా చేరిపోయాయి. నకిలీ లేదా పాత గుడ్లని జనాలకి అంటగడుతున్నారు. ప్రతిదానికీ గడువు తేదీ ఉంటుంది. ఆ తర్వాత ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. మీరు మార్కెట్‌కి వెళ్లినప్పుడల్లా జాగ్రత్తగా గుడ్లు కొనండి. లేదంటే మోసం జరగవచ్చు. తాజా, పాత గుడ్ల మధ్య వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
1. ఎక్స్‌పైరీ డేట్‌ని చెక్ చేయండి
ఈ రోజుల్లో సూపర్ మార్కెట్‌లు లేదా పెద్ద షాపుల్లో ఎక్స్‌పైరీ డేట్ రాసి ఉన్న చిన్న ట్రేలలో ప్యాక్ చేసిన గుడ్లు కనిపిస్తాయి. కాబట్టి వాటిని కొనుగోలు చేసేటప్పుడు తేదీని చెక్ చేయండి. దుకాణదారుడు మీకు పాత గుడ్లను అమ్మకుండా చూసుకోండి. మీరు గడువు తేదీకి ముందు గుడ్లను తినగలరా లేదా అనే దాని గురించి ఆలోచించండి.
2. తాజాగా ఉన్నాయా..
మార్కెట్‌లో దొరికే గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా అనేది వాసన చూడటం ద్వారా తనిఖీ చేయండి. వాసన ద్వారా గుడ్ల గురించి తెలుసుకోవచ్చు. ముందుగా కోడిగుడ్డును పగలగొట్టి పాత్రలో వేసి వాసన చూడండి. అది కుళ్ళిన వాసన ఉంటే అది చెడిపోయిందని అర్థం.
3. జాగ్రత్తగా తనిఖీ చేయండి.
చాలా మంది దుకాణదారులు పాత గుడ్డును అందంగా కనిపించేలా రంగులు వేస్తారు. అయినప్పటికీ కొత్త లేదా పాత గుడ్డును నిశితమైన దృష్టితో గుర్తించవచ్చు. గుడ్డు పగలకుండా పెంకులు రాలిపోకుండా ఉండాలి. ఏదైనా తేడా ఉంటే ఆ గుడ్లను కొనవద్దు.