Fenugreek Seeds: మధుమేహ రోగులకి మెంతులు దివ్య ఔషధం..!
Fenugreek Seeds: మధుమేహ రోగులకి మెంతులు దివ్య ఔషధం..!
Fenugreek Seeds: మెంతులు మధుమేహ రోగులకు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఇందుకోసం వీటిని అనేక విధాలుగా తీసుకోవచ్చు. కొన్ని మెంతులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి. అనంతంర నాని ఉన్న మెంతిగింజలని తినాలి. ఆ తర్వాత టిఫిన్ చేయవచ్చు. ఇలాచేస్తే మధుమేహ రోగులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి.
అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం చాలా మంచిది. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకునే ప్రమాదం ఉండదు. దీనివల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. స్థూలకాయులు, షుగర్ రోగులు మెంతులు కచ్చితంగా తీసుకోవాలి. మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఒక చెంచా మెంతులను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడంవల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి మెంతులు ఉపయోగపడుతాయి. మెంతి గింజల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న చక్కెరను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే మెంతి గింజలను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ 10 గ్రాముల మెంతులు తీసుకోవచ్చు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.