గాలి కాలుష్యం వల్ల ముఖంపై ఎఫెక్ట్.. ఈ చిట్కాల ద్వారా దుమ్ము ధూళి తొలగించండి..!
గాలి కాలుష్యం వల్ల ముఖంపై ఎఫెక్ట్.. ఈ చిట్కాల ద్వారా దుమ్ము ధూళి తొలగించండి..!
Skin Care Tips: ప్రతి ఒక్కరూ మచ్చలేని మెరిసే చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కాలుష్యం కారణంగా గాలిలో ధూళి కణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇది ఆరోగ్యానికే కాకుండా చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది చర్మంపై మంట, డీ హైడ్రేషన్, కొల్లాజెన్ దెబ్బతినడం, నల్ల మచ్చలు, చర్మం ముడతలకి కారణం అవుతుంది. ఈ పరిస్థితిలో చర్మంపై పేరుకుపోయిన ధూళి కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చు. దానికోసం కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
విటమిన్-సి సీరమ్‌ను అప్లై చేయండి
ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత విటమిన్-సి,ఫెరులిక్ యాసిడ్ కలిగిన సీరమ్‌ను తప్పనిసరిగా అప్లై చేయాలి. ఈ సీరమ్‌లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్-సి రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు పోయి వదులుగా ఉన్న చర్మం బిగుతుగా మారడంలో సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్ రాసుకోవాలి
చర్మ సంరక్షణలో ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్‌ను చేర్చుకోవాలి. ఇది చర్మాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మాన్ని గాలిలో ఉండే కాలుష్య కణాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
సన్‌స్క్రీన్ అప్లై చేయడం
ఎండలో వెళ్లినప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఇది కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ద్రవ పానీయాలు
ఎండాకాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కొబ్బరినీరు, పుచ్చకాయ, దోసకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే నీటిశాతం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.