Health Tips: ఈ ఆహారాలు తింటే ఎముకల సమస్యలు ఉండవు..!
Health Tips: వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో నొప్పులు, ఇతర సమస్యలు రావడం మామూలే.
Health Tips: వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో నొప్పులు, ఇతర సమస్యలు రావడం మామూలే. అయితే ఇప్పుడు చిన్న వయసులోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఎముకల ఆరోగ్యం భవిష్యత్తులో మెరుగ్గా ఉండాలంటే ఆహారంలో కొన్ని ప్రత్యేక పదార్థాలని చేర్చుకోవాలి. రోజువారీ ఆహారం, జీవనశైలి, నిద్ర, వ్యాయామం ఎలా ఉన్నాయనే దానిపై ఎముకల శక్తి ఆధారపడి ఉంటుంది. అప్పుడే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరు.
ఎముకలను దృఢంగా మార్చే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు ఉంటాయి. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కలిసి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం, పచ్చి ఆకుకూరలు, కొవ్వు చేపలు, పెరుగు, ఆలివ్ నూనె, అరటిపండు, ఆరెంజ్, నువ్వులు సోయా పదార్థాలు ఎముకలని బలంగా చేస్తాయి. అలాగే కొన్ని రకాల తృణ ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి కాల్షియం లక్షణాలను తొలగిస్తాయి.
చికెన్, మటన్ వంటి అనేక జంతు ప్రోటీన్ ఆహారాలు మీ శరీరంలో కాల్షియంను తగ్గిస్తాయి. అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. రెడీ-టు-ఈట్ ఫుడ్‌లో చాలా ఉప్పు ఉంటుంది. ఇది శరీరం నుంచి కాల్షియంను తొలగిస్తుంది. అందువల్ల శరీరంలో సోడియం తగిన మోతాదులో ఉంటే మంచిది. అతిగా మద్యం సేవించడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాద పెరుగుతుంది. టీ, కాఫీలలో లభించే కెఫిన్ కాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు కొన్ని వర్కౌట్‌లు, విటమిన్ డి3 తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి.