Liver Diseases: రోజు వీటిని తింటే లివర్ డ్యామేజ్.. ఈరోజే డైట్ నుంచి తీసేయండి..!
Liver Diseases: ఈ రోజుల్లో చాలా మంది లివర్‌కి సంబంధించిన సమస్యలని ఎదుర్కొంటున్నారు.
Liver Diseases: శరీరంలోని అవయవాలలో లివర్ అత్యంత ముఖ్యమైనది. ఇది పనిచేయకుంటే శరీరంలో ఏ పని జరగదు. వ్యాధులన్ని చుట్టుముడతాయి. ఈ రోజుల్లో చాలా మంది లివర్‌కి సంబంధించిన సమస్యలని ఎదుర్కొంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నేటిరోజుల్లో చాలా మంది బయట తినడానికి ఇష్టపడతున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఏయే పదార్థాలను తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందో ఈరోజు తెలుసుకుందాం.
పిండి ఆహారాలు
పిండితో చేసిన ఆహారాలని తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు ఏవి ఉండవు. అందుకే పాస్తా, పిజ్జా, బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుంది.
ఆల్కహాల్
లివర్ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ లివర్‌ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతే కాదు ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల లివర్‌లో వాపు ఏర్పడుతుంది. అందుకే లివర్‌కి సంబంధించిన సమస్య ఉంటే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.
చక్కెర ఆహారాలు
చక్కెర ఉండే ఆహారాలు లివర్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఊబకాయం బారిన పడుతారు. అందువల్ల లివర్‌కి సంబంధించిన సమస్య ఉంటే చక్కెర ఉండే ఆహారాలని మినహాయించాలి. ఎందుకంటే ఇది లివర్‌ని దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి.
ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు జీర్ణం కావడం చాలా కష్టం. అందుకే బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి లివర్‌కి హాని కలిగించే ఆహారాలు. వీటిని జీర్ణం చేయడానికి లివర్ అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.