Sleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!

Sleep: మనం తరచుగా ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ ప్రతి ఆహారం తినడానికి సరైన సమయం ఉంటుంది.

Update: 2022-08-18 15:30 GMT

Sleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!

Sleep: మనం తరచుగా ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ ప్రతి ఆహారం తినడానికి సరైన సమయం ఉంటుంది. పగటిపూట కొన్ని పదార్థాలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అదే విధంగా కొన్ని పదార్థాలు తినడానికి రాత్రి అనువుగా ఉంటుంది. కానీ రాత్రిపూట తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటి వల్ల చాలా నష్టాలు ఉంటాయి. అలాంటి వాటి గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1.కాఫీ

కొందరికి రాత్రిపూట కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల అతడు రాత్రిపూట అస్సలు నిద్రపోలేడు. దీనివల్ల అతడి నిద్రచక్రం చెదిరిపోతుంది. ఉదయం పూట అలసిపోయినట్లుగా కనిపిస్తాడు. కాఫీలో కెఫీన్ ఉంటుంది ఇది మెదడును సక్రియం చేస్తుంది. దీనివల్ల నిద్ర మాయమవుతుంది. అందుకే రాత్రి పూట కాఫీ తాగకూడదు.

2.దోసకాయ

మనం రాత్రిపూట దోసకాయ తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. దోసకాయ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దోసకాయ తినడానికి సరైన సమయం మధ్యాహ్నం. కానీ మీకు ఒకవేళ తినాలనిపిస్తే రాత్రి 7 గంటలలోపు తింటే మంచిది.

3.స్వీట్లు

తీపి ఆహారాన్ని అందరు ఇష్టపడుతారు. కానీ రాత్రిపూట స్వీట్లు తినడం చాలా హానికరం. రాత్రిపూట మిఠాయిలు తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఇవి తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీని వల్ల నిద్ర పట్టదు.

Tags:    

Similar News