Health Tips: ఈ ఎర్రటి పండు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. అదేంటంటే..?
Health Tips: నేటి కాలంలో గుండె సమస్యలున్నవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు.
Health Tips: నేటి కాలంలో గుండె సమస్యలున్నవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జవనశైలి సరిగ్గా లేకపోవడం. ఆయిల్, జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడటం. వాస్తవానికి ఇవి తినడానికి రుచిగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా హాని కలిగిస్తాయి. ఇవి మన రక్తంలోని సిరల్లో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల రక్తపోటును పెరుగుతుంది. ఇది గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే డైట్‌లో ఒక పండు చేర్చుకుంటే గుండెని పదిలంగా కాపాడుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది గుండెపోటు రాకుండా చేస్తుంది. గుండె దీర్ఘాయువు కోసం ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినాలి. ఇది మిమ్మల్ని స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. స్ట్రాబెర్రీలు పాలీఫెనాల్స్ గొప్ప మూలంగా చెప్పవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ 2 నుంచి 3 కప్పుల ముక్కలు చేసిన స్ట్రాబెర్రీలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది.
మీరు గుండెపోటును నివారించాలంటే రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవలసి ఉంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని పరిశోధనల ద్వారా తేలింది. అందుకే ప్రతిరోజు డైట్‌లో స్ట్రాబెర్రీ పండు ఉండే విధంగా చూసుకోండి. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు కచ్చితంగా తినాలి. అప్పుడు గుండె సమస్యల నుంచి బయటపడవచ్చు.