Health Tips: పండ్లని ఇలా తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు..!
Health Tips: పండ్లని ఇలా తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు..!
Health Tips: కొన్నిసార్లు మనం పండ్లను తింటాం. కానీ దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కారణం వాటిని తప్పుగా తీసుకోవడమే. పండ్లని సంపూర్ణ ఆహరంగా పరిగణిస్తారు. మన శరీరానికి అవసరమైన దాదాపు అన్ని ఖనిజాలు, పోషకాలు పండ్లలో ఉంటాయి. రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పండ్లని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.
ఆహారంతో పండ్లను తీసుకోవద్దు
చాలా మంది పండ్లను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే కూరగాయల సలాడ్‌తో పాటు పండ్లను కలిపి తింటారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల విషపూరిత ప్రభావాలు ఉంటాయి. జీర్ణక్రియకు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.
జ్యూస్ తాగవద్దు
ఫ్రూట్ జ్యూస్ తాగే బదులు వాటిని పూర్తిగా కట్ చేసి తినడం మంచిది. రసాన్ని ఫిల్టర్ చేసినప్పుడు చాలా పోషకాలు బయటకు పోతాయి. కాబట్టి జ్యూస్ వినియోగానికి దూరంగా ఉంటే మంచిది.
పాలతో కలిపి తినకూడదు
చాలా మంది పండ్లని పాలతో కలిపి తీసుకుంటారు. పాలలో మిక్స్ చేసి మిల్క్ షేక్ లా తీసుకుంటారు. కానీ పాలతో పండ్లు తినడం హానికరం.
సాయంత్రం తినవద్దు
రాత్రి భోజనం తర్వాత పండ్లు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. షుగర్ దేనిలోనైనా కిణ్వ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అందుకే తిన్న తర్వాత లేదా ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం మానుకోవాలి. కానీ సాయంత్రం ఫ్రూట్ చాట్ తినవచ్చు.