Health Tips: బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారా? ఈ పండు తినండి..మీలో స్టామినాను పెంచుతుంది
Health Tips: బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారా? ఈ పండు తినండి..మీలో స్టామినాను పెంచుతుంది
Health Benefits Of Anjeer : అంజీర్ తీపి రుచిలోనే కాదు.. పోషకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పురుషుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడే అనేక గుణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు కూడా నయమవుతాయి.అత్తి పండ్లలో సహజ చక్కెర, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ప్రముఖ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, ఐరన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తం తక్కువగా ఉన్నవారు..బీపీ, షుగర్ వంటి వ్యాధలతో బాధపడుతున్నవారు అంజీర్ తింటే ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి అంజీర పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గించడంలో:
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అంజీర్ స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి అంజీర్ నీరు దివ్యౌషధంగా ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇందులో ఉండే పీచు పదార్ధం ప్రజలకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. ఇది జీవక్రియను పెంచి.. కొవ్వును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఫైబర్:
పండ్లలో సహజ చక్కెర, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ బలం, శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జింక్,మెగ్నీషియం వంటి ఖనిజాలు అత్తి పండ్లలో కనిపిస్తాయి. ఇవి పురుషులకు చాలా ముఖ్యమైనవి. ఇవి స్పెర్మ్‌లు ఏర్పడటానికి సహాయపడటంతోపాటు వాటి కదలికను పెంచుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
అత్తి పండ్లలో ఉండే ఫైబర్‌లు చక్కెరను రక్తంలోకి నెమ్మదిగా శోషించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా, అంజీర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిస్తాయి. ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.