Fast Food: ఫాస్ట్ ఫుడ్ భారతీయుల ఆరోగ్యానికి చెడ్డది.. కానీ విదేశీయులకు ఎలా మంచిది..?

Fast Food: ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి చెడ్డదని అందరికి తెలుసు. అందుకే భారతీయులు దాదాపుగా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు

Update: 2021-11-22 15:56 GMT
ఫాస్ట్ ఫుడ్ (ఫైల్ ఇమేజ్)

Fast Food: ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి చెడ్డదని అందరికి తెలుసు. అందుకే భారతీయులు దాదాపుగా దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో తింటారు. అయితే ఇదే ఫాస్ట్‌ఫుడ్‌ని అమెరికాతో పాటు ఇతర దేశాలలోని ప్రజలు రెగ్యూలర్‌గా తింటారు. కానీ వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. భారతీయులు ఆహారంలో రోటీ లేదా అన్నం తింటారు. అదే విధంగా అక్కడి ప్రజలు పిజ్జా బర్గర్‌ తింటారు. కానీ ఇండియన్స్‌ నిత్యం ఫాస్ట్‌ఫుడ్‌ తింటే ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ విదేశీయులకు ఏమి కాదు.. ఎలా..? ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం.

భిన్నమైన తయారీ విధానం

అక్కడి పిజ్జా, బర్గర్‌ తయారీకి ఇండియాలో కంటే భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తారు. అక్కడ పిజ్జా చాలా లైట్‌గా ఉంటుంది. దీని కారణంగా ఇది శరీరానికి తక్కువ హాని చేస్తుంది. అంతే కాకుండా అందులో ఉండే పోషకాల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కూరగాయలు తదితరాలు ఎక్కువ మోతాదులో కలుపుతారు. నిజానికి అక్కడి ప్రజలు ఒకపూట భోజనంలో ఫాస్ట్ ఫుడ్ తింటే, మరో పూటలో కూరగాయలు, చికెన్ మొదలైన వాటికి తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ సమతుల్యతను కాపాడుకుంటారు. ఆరోగ్యానికి అనుగుణంగా ఆహార పద్దుతులను పాటిస్తారు.

శరీరంపై శ్రద్ధ

అంతే కాకుండా ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారు తమ ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకుంటారు. చాలా మంది ప్రజలు జిమ్, స్విమ్మింగ్ పూల్, నడక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ల వాడకం మొదలైనవాటిని ఉపయోగిస్తారు. అందుకే వారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానం పాస్ట్‌ ఫుడ్‌కి అనుకూలంగా ఉంటాయి. అక్కడి ప్రజల శరీర విధానం ఆ విధంగా ఉంటుంది. దీని కారణంగా పాస్ట్ ఫుడ్‌ ఆహారాలు అక్కడి ప్రజలను ప్రభావితం చేయవు. అవే వంటకాలను భారతీయులు తింటే వెంటనే ఆస్పత్రిలే చేరాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News