Egg Benefits: గుడ్డు ఈ పద్దతిలో తింటే బరువు తగ్గడం ఖాయం..!

Egg Benefits: స్థూలకాయం అనేది ఏ మనిషికైనా పెద్ద సమస్య.

Update: 2022-09-04 01:30 GMT

Egg Benefits: గుడ్డు ఈ పద్దతిలో తింటే బరువు తగ్గడం ఖాయం..!

Egg Benefits: స్థూలకాయం అనేది ఏ మనిషికైనా పెద్ద సమస్య. ఎందుకంటే బరువు పెరిగిన తర్వాత మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో కచ్చితమైన డైట్‌ పాటించాలి. అయితే ప్రత్యేక పద్ధతిలో గుడ్లు తింటే సులువుగా బరువు తగ్గవచ్చు. చాలా మందికి గుడ్డు రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుడ్లని ఉడకబెట్టి, ఆమ్లెట్, కూర చేసి ఇలా అనేక రకాలుగా తినవచ్చు. అయితే గుడ్లను 3 పదార్థాల కలయికలో ఉడికించినట్లయితే బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

1. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటాయి. అందువల్ల కొబ్బరి నూనె ద్వారా చేసిన ఆమ్లెట్ తింటే బరువు తగ్గడం సులభం అవుతుంది.

2. బ్లాక్ పెప్పర్

మీరు ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్ మీద కారం పొడిని చల్లి తినే ఉంటారు. దీని కారణంగా గుడ్డు మరింత ఆరోగ్యంగా మారుతుంది. నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని కారణంగా రుచి చేదుగా ఉంటుంది. కానీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. క్యాప్సికమ్

చాలా రెస్టారెంట్లలో క్యాప్సికమ్‌ను గుడ్లతో అలంకరించడం మీరు చూసే ఉంటారు. మీరు ఇంట్లో కూడా గుడ్లని క్యాప్సికమ్‌తో ఉడికించవచ్చు. ఎందుకంటే క్యాప్సికమ్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ గుడ్డు, క్యాప్సికం కలిపి తింటే బరువు తగ్గడం సులువవుతుంది.

Tags:    

Similar News