Eating Curd Evening: సాయంత్రం పూట పెరుగు తింటే శరీరానికి ఈ ప్రయోజనాలు.. అవేంటంటే..?
Eating Curd Evening: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని అన్నికాలలో తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Eating Curd Evening: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని అన్నికాలలో తినవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, బి విటమిన్లు, అధికంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల పొట్ట సమస్యలు దరిచేరవు. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యాహ్నం పెరుగు తినలేకపోతే సాయంత్రం తింటే మంచి లాభాలు ఉంటాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది
పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. సాయంత్రం పెరుగు తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు ఉండవు. అందుకే ప్రతి ఒక్కరు సాయంత్రం పూట పెరుగు తినడం అలవాటు చేసుకోవాలి.
బరువు తగ్గుతారు
పెరుగులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే అది బరువును అదుపులో ఉంచుతుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి
ఎముకలు దృఢంగా ఉండేందుకు పెరుగు తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో పనిచేస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పదే పదే జలుబు వస్తుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం. ఈ పరిస్థితిలో పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్‌ఫెక్షన్లు బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల ఏర్పడుతాయి. అందుకే ప్రతిరోజు పెరుగు తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌లు దరిచేరకుండా ఉంటాయి.