Health Tips: రోజూ ఈ పండు తింటే కొలస్ట్రాల్ తగ్గుతుంది.. అదేంటంటే..?
Health Tips: నేటి రోజుల్లో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
Health Tips: నేటి రోజుల్లో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జీవన విధానంలో మార్పు రావడం, కూర్చొని చేసే ఉద్యోగాలు ఎక్కువగా చేయడం, వేయించిన ఆహారాలు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం మొదలైన కారణాలు ఉన్నాయి. కొలస్ట్రాల్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అందుకే వీలైనంత త్వరగా కరిగించుకోవడం ఉత్తమం. అయితే ప్రతిరోజూ ఒక పండు తినడం వల్ల మీకు తెలియకుండానే కొలస్ట్రాల్ కరిగించుకోవచ్చు. ఈ రోజు ఆ పండు గురించి తెలుసుకుందాం.
సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇది అధిక రక్తపోటు, మధుమేహంతో సహా అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో ఆవకాడోను డైట్‌లో చేర్చుకోవాలి. దీనిని ప్రతిరోజూ తినడం వల్ల కొలస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. వాస్తవానికి ఆవకాడో కొంచెం ఖరీదైన పండు. కానీ ఈ పండు తినే ధోరణి కొన్ని సంవత్సరాలుగా పెరిగింది. ఇది గుండె , కళ్లు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరం మొత్తం అభివృద్ధికి తోడ్పడుతుంది.
అవోకాడోలో లభించే పోషకాలు
మధ్యస్థ పరిమాణంలో ఉండే అవోకాడోలో సుమారు 240 కేలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్, 22 గ్రాముల కొవ్వు (15 గ్రాముల మోనోశాచురేటెడ్, 4 గ్రాముల బహుళఅసంతృప్త, 3 గ్రాముల సంతృప్త), 10 గ్రాముల ఫైబర్, 11 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది.
రోజూ అవకాడో తినడం వల్ల ప్రయోజనాలు
దాదాపు 6 నెలల పాటు ఆవకాడో తినిపిస్తూ కొంతమందిపై పరిశోధనలు జరిగాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. ఇలా చేయడం వల్ల నడుము, పొత్తికడుపులో కొవ్వు తగ్గడంతోపాటు రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. బరువును అదుపులో ఉంచుకున్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఈ ప్రత్యేకమైన పండును తినవచ్చు.