Dengue Food: డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఇవి తినండి.. ప్లేట్‌లెట్ కౌంట్ ఒక్కసారిగా పెరుగుతుంది..!
Dengue Food: శీతాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
Dengue Food: శీతాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు దోమతెరలు లేదా దోమల బిళ్లలని ఉపయోగిస్తారు. దోమ కాటు వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ కారణంగా శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. డెంగ్యూతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఈ రోజు అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
బొప్పాయి ఆకు
బొప్పాయి ఆకు డెంగ్యూతో పోరాడే సామర్ధ్యం కలిగి ఉంటుంది. బొప్పాయి ఆకుల గురించి ఒక పరిశోధన జరిగింది. డెంగ్యూ జ్వరంలో బొప్పాయి రసాన్ని ఇస్తే అది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. ఇది కాకుండా వైరల్ వ్యాధులలో సహజ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్
అమెరికన్ పరిశోధకుడు ఎస్ ఫ్రాబాసిల్ 2017లో ఆరెంజ్ జ్యూస్‌పై ఒక పరిశోధన చేశాడు. డెంగ్యూ జ్వరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరెంజ్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. నిజానికి విటమిన్ సి నారింజలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది కాబట్టి డెంగ్యూ రోగులు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.
కొబ్బరి నీరు
డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరంలో శరీరం నుంచి నీరు పూర్తిగా ఆవిరవుతుంది. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ పరిస్థితిలో కొబ్బరి నీటి వినియోగం శరీరం నుంచి నీటి కొరతను తీరుస్తుంది. ఎందుకంటే ఇది సహజ వనరు. ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో దానిమ్మ రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎక్కువ మేలు జరుగుతుంది.