Health Tips: హార్మోన్లని నియంత్రించడానికి ఈ విత్తనాలు బెస్ట్‌ ఆప్షన్..!

Health Tips: హార్మోన్లని నియంత్రించడానికి ఈ విత్తనాలు బెస్ట్‌ ఆప్షన్..!

Update: 2022-09-10 04:30 GMT

Health Tips: హార్మోన్లని నియంత్రించడానికి ఈ విత్తనాలు బెస్ట్‌ ఆప్షన్..!

Health Tips: శరీరంలో హార్మోన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎప్పుడు ఏం తినాలి, ఎంతసేపు పడుకోవాలి, రోజంతా ఏం చేయాలనే సంకేతాలన్ని హార్మోన్ల వల్లనే జరుగుతాయి. మహిళల రుతుచక్రం, ఆకలిని నియంత్రించడం కూడా హార్మోన్ల బాధ్యతే. కానీ నేటి చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో హార్మోన్లు సక్రమంగా ఉండటం లేదు. శరీరంలో వీటి ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

1. పొద్దుతిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఈ, సెలీనియం ఉంటాయి. ఇవి ప్రొజెస్టెరాన్‌ను పెంచుతాయి. ఈ విత్తనాలను నానబెట్టి పండ్లతో కలిపి తినవచ్చు. లేదా జ్యూస్‌లలో కలుపుకొని తాగవచ్చు.

2. గుమ్మడికాయ గింజలు

ఈ గింజల్లో ఒమేగా 3, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలను సలాడ్‌లు, పానీయలలో వేసుకొని తినవచ్చు. ఇది కాకుండా ఈ విత్తనాలను పండ్లతో లేదా వెన్నలో కలపడం ద్వారా తినవచ్చు.

3. చియా విత్తనాలు

ఈ గింజల్లో ఒమేగా 3, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాలు బహిష్టు సమస్యలని తగ్గిస్తాయి. ఈ విత్తనాలను కనీసం రెండు గంటలు నానబెట్టి ఆపై వాటిని జ్యూస్‌లు లేదా పెరుగులో కలుపుకొని తినవచ్చు.

4. అవిసెగింజలు

అవిసె గింజలు ఒమేగా 3, ఫైబర్ మంచి మూలం. ఇవి సంతానోత్పత్తిని పెంచడానికి, ఈస్ట్రోజెన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. పెరుగు, సలాడ్, పానీయాలు, మజ్జిగలో వేసుకొని తినవచ్చు.

Tags:    

Similar News