దానిమ్మ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

దానిమ్మ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Update: 2022-09-10 14:30 GMT

దానిమ్మ ఆరోగ్యానికి బ్రహ్మాస్త్రం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pomegranate Benefits: ప్రతిరోజు శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. అందుకే వైద్యులు ఆపిల్, నారింజ లేదా మరేదైనా పండ్లను తినమని సూచిస్తారు. అయితే ఇందులో దానిమ్మ పండు అత్యంత ముఖ్యమైనది. దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ప్రతిరోజూ దానిమ్మపండును తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోజుకి పుష్కలంగా శక్తిని అందిస్తుంది. దీనిని రోజూ తింటే ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

మీరు ఎప్పుడూ ఏదో ఒక వ్యాధి బారిన పడుతుంటే రోజూ దానిమ్మను తినాలి. ప్రతిరోజూ దానిమ్మపండు తినడం వల్ల గుండె దృఢంగా ఉంటుంది. రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. ఎలాంటి జబ్బులు రావడానికి అనుమతించదు. ఈ పండు మీ కండరాలు, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం జీవనశైలికి మంచిది. దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సమయం దొరకని వారు దానిమ్మ రసం తాగడం మంచి ఎంపిక.

దానిమ్మ గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మపండులో ఉండే పాలీఫెనాల్స్ వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. దానిమ్మలో ఎరుపు, జ్యుసి రేణువులు తీపి, పుల్లటి రుచిని కలిగి ఉంటాయి. ఒక దానిమ్మపండులో 83 కిలో కేలరీలు, 13 గ్రాముల చక్కెర, ఫైబర్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ 53 ఉంటుంది. ఇందులో చాలా ఫోలేట్, పొటాషియం, విటమిన్ K ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ దానిమ్మపండు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది మీ BPని తగ్గిస్తుంది. LDL అంటే కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News