చలికాలంలో డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటున్నారా..! ఈ విషయాలు గమనించండి..
Dry Fruits: కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ శీతాకాలంలో చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి.
Dry Fruits: డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో చాలా రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ శీతాకాలంలో చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు వీటిని మోతాదులో తీసుకుంటే మంచిదే కానీ మితిమీరితే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే నీరు అవి జీర్ణం కావడానికే సరిపోతుంది. దీని కారణంగా మీరు హైడ్రేటెడ్‌గా ఉంటారు. దీని వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ చాలావరకు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అంటారు. కానీ బరువు తగ్గడానికి వాటిని ఎంత తినాలో తెలుసుకోవడం ముఖ్యం. ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. శీతాకాలంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నుంచి వచ్చే చక్కెర దంతాలలో నొప్పి కలిగిస్తుంది.
వాస్తవానికి వాటిలో ఉండే చక్కెర పంటి నొప్పి, పురుగులు పడటానికి కారణమవుతుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా తింటే వాటిలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో పెరుగుతుంది దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువవుతుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే పొట్ట సమస్యలు వదలవు. అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతాయి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల కడుపు సమస్యలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు డయేరియా వంటి తీవ్రమైన వ్యాధులకు గురికావల్సి ఉంటుంది.