Health Tips: చల్లటి వాతావరణంలో టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఆరోగ్యానికి హాని..!
Health Tips: చల్లటి వాతావరణంలో టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఆరోగ్యానికి హాని..!
Health Tips: శీతాకాలం కొనసాగుతోంది. ఈ వాతావరణంలో ప్రజలు వెచ్చదనం కోసం టీ తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు జలుబు, దగ్గు ఉన్నవారు కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటారు. కానీ అధికంగా టీ తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. అతిగా టీ తాగడం అనే అభిరుచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. టీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
పొట్టకు నష్టం
అతిగా టీ తాగడం వల్ల వ్యక్తికి కడుపు సమస్యలు ఏర్పడుతాయి. ఎక్కువగా టీ తాగడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, కడుపులో మలబద్ధకం సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల అతిగా టీ తాగే విషయంలో అప్రమత్తంగా ఉండండి.
నిద్ర పట్టడంలో ఇబ్బంది
టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగించేలా పనిచేస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తికి రాత్రి నిద్ర రాదు. అతను ఉదయాన్నే లేచి చిరాకుగా ఉంటాడు. అంతే కాదు ఎక్కువగా టీ తాగడం వల్ల మూడ్ స్వింగ్ వస్తుంది.
గుండెల్లో మంట
చాలా మంది టీ తాగడం వల్ల గుండెల్లో మంటగా ఉంటుందని అంటారు. అంతే కాకుండా గ్యాస్, సోర్ బెల్చింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నెర్వస్ ఫీలింగ్
టీలో ఉండే కెఫిన్ మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాదు ఎక్కువగా టీ తీసుకోవడం వల్ల నెర్వస్ గా ఉంటారు. కాబట్టి టీ ఎక్కువగా తీసుకోకుండా ప్రయత్నించండి.
పేగులపై ప్రభావం
టీ తాగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పేగులు పాడవుతాయి. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.