Health News: మీరు టిఫిన్‌తో పాటు టీ కూడా తాగుతున్నారా..! హానికరం..
Health News: కొన్ని ఆహారాలు ఒకదానికొకటి విరుద్దంగా పనిచేస్తాయి. అందువల్ల వాటిని ఎప్పుడు కలిపి తినకూడదు.
Health News: కొన్ని ఆహారాలు ఒకదానికొకటి విరుద్దంగా పనిచేస్తాయి. అందువల్ల వాటిని ఎప్పుడు కలిపి తినకూడదు. ఇలా చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. చాలామంది టిఫిన్ చేసిన వెంటనే టీ తాగడం అలవాటు. కానీ ఇది సరైన పద్దతి కాదు. వాస్తవానికి టీ నీరసాన్ని తొలగిస్తుంది. ఉదయాన్నే టిఫిన్‌గా ఉప్మా, దోస, పోహ ఇలా ఏదో ఒకటి తింటాం. తర్వాత టీ తాగుతాం. ఎందుకంటే టీ తాగందే టిఫిన్ పూర్తయిందనే భావన కలుగదు. కానీ నిజాలు వేరే రకంగా ఉన్నాయి.
టిఫిన్‌తో పాటు టీ తీసుకోవడం సరైందేనా అనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీతో పాటు ప్రజలు తీసుకునే అనేక రకాల స్నాక్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది చాలా హానికరం. ఆయుర్వేదం ప్రకారం టిఫిన్, టీ రెండు వేర్వేరు పదార్థాలు. వీటిని ఎప్పుడూ కలిసి తినకూడదు. ఆయుర్వేదంలో ఆహారం ఒక రకమైన శక్తిని ఇస్తుందని చెప్పారు. ఆ సమయంలో దానికి వ్యతిరేక శక్తి ఇచ్చే ఆహారం కానీ పానియాన్నీ కానీ తీసుకుంటే శరీరం పని వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రెండూ శరీరంలో కలిస్తే టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు.
ఇది మన జీర్ణవ్యవస్థ , జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది శారీరక సమస్యలకు దారితీస్తుంది. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వాంతులు, మైగ్రేన్, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడుతాయి. దీనివల్ల ఎసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. కావాలంటే మీరు అల్పాహారం తర్వాత కొంత సమయం వేచి ఉండి టీ తీసుకోవచ్చు. అది ఆరోగ్యానికి చాలా తక్కువ హాని చేస్తుంది. వీలైనంత వరకు టీని ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు.